అత్తగారి ముందు బికినీ
అత్తగారి ముందు బికినీ
Published Thu, Sep 12 2013 12:53 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
‘‘అత్త ఉన్నా నేను ఉత్తమ కోడలినే. మా అత్తమ్మ చాలా మంచిది’’ అంటున్నారు కరీనాకపూర్. పుట్టింట్లో లభించిన స్వేచ్ఛ, ఆనందం అత్తింట్లో లభిస్తే ఏ ఆడపిల్లకైనా అంతకన్నా కావల్సింది ఏముంటుంది? ఏ కొంతమందికో మాత్రమే ఆ ఆనందం దక్కుతుంది. అలాంటి అదృష్టవంతుల్లో నేనూ ఒకదాన్ని’’ అని కరీనా చెబుతూ -‘‘మా అత్తమ్మ వాళ్లింట్లో నన్ను కూతురిలా చూసుకుంటారు.
అందుకే ఆనవాయితీ ప్రకారం సైఫ్ తల్లి నాకు అత్తమ్మ అయినా, నేను మాత్రం అమ్మలానే భావిస్తా. మనం ఉన్నది 2013లో... 1990ల్లో కాదు. కానీ కొంతమంది అత్తలు పాత తరంలో ఉండిపోతారు. మా అత్తగారు మాత్రం ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టే ఉంటారు. నా వృత్తినీ వ్యక్తిగత జీవితాన్ని విడివిడిగా చూస్తారామె. అందుకే పెళ్లయినా నిర్భయంగా నేను సినిమాలు చేసుకోగలుగుతున్నాను.
ఇక, వ్యక్తిగతంగా మా అత్తగారిచ్చే స్వేచ్ఛ గురించి ఓ ఉదాహరణ చెప్పాలంటే.. ఆ మధ్య మేం మాల్దీవులు వెళ్లాం. అక్కడి సాగర తీరంలో బాగా ఎంజాయ్ చేశాం. నేనైతే బికినీ వేసుకున్నాను. నాకు తెలిసి ఏ కోడలూ అత్త ముందు ఇలా చేయడానికి సాహసించదు. కానీ సందర్భానికి తగ్గట్టు వస్త్రధారణ చేసుకోవడం తప్పు కాదన్నది మా అత్తగారి అభిప్రాయం. ఇలా ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆలోచించే అత్తకి కోడలవ్వడం నేను చేసుకున్న పుణ్యం’’ అన్నారు.
Advertisement
Advertisement