maldeevulu
-
ట్రైనీ ఐపీఎస్ అధికారుల సాహసంపై ప్రశంసల జల్లు
సాక్షి,హైదరాబాద్: నగరంలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్వీపీఎన్పీఏ)లో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్‌లు సముద్రంలో మునిగిపోతున్న ఓ కుటుంబాన్ని కాపాడి వారి పాలిట ఆపద్భాందవులు అయ్యారు. ఎన్‌పీఏలోని ట్రైనీ ఐపీఎస్‌లు అభినవ్ ధీమాన్, అభినయ్ విశ్వకర్మ, భరత్ సోనీ, గౌహర్ హసన్, సువేందు పాత్ర, తెషూ లెందీప్ (భూటాన్ ) అహ్మద్ అబ్దుల్ అజీజ్ (మాల్దీవులు), మహమ్మద్ నజీవ్ (మాల్దీవులు) భారత్‌యాత్ర కార్యక్రమం కోసం ఇటీవల లక్షద్వీప్ దీవులకు వెళ్లారు. 8 trainees including 5 IPS, 2 from Maldives and one from Bhutan, during their visit to Lakshadweep islands, showed valiant act & rescued a family drowning in the sea. The Academy appreciated the self-less act of bravery true to the sense of uniform to help the people in need pic.twitter.com/1EH7JsQeQ5 — SVPNPA (@svpnpahyd) June 5, 2021 అక్కడ వీరంతా బీచ్‌లో గడుపుతున్న సమయంలో భారత వైమానిక దళానికి చెందిన ఓ అధికారి కుటుంబం ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగిపోతుండటం చూశారు. వెంటనే ఈ ఎనిమిది మంది సముద్రంలోకి దూకి వారందర్నీ రక్షించారు. విషయం తెలిసిన అకాడమీ వీరి ధైర్య సాహసాలను ఆదివారం ప్రత్యేకంగా అభినందించి మీడియాకు వెల్లడించింది. ట్రైనీ ఐపీఎస్ అధికారుల సాహసంపై నెటిజన్లు ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు. Kudos to our two gallant officers, Chief Inspector of Police Ahmed Abdul Azeez & Chief Inspector of Police Mohamed Nazim currently undergoing IPS training at the @svpnpahyd, for their bravery in saving a family of 4 including 2 children from a drowning incident in Lakshadeep 1/2 pic.twitter.com/H6JELebO4i — Maldives Police (@PoliceMv) June 5, 2021 చదవండి: నారాయణఖేడ్‌లో బొలేరో వాహనం బీభత్సం -
తూత్తుకుడిలో అదీబ్
సాక్షి, చెన్నై : మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ తూత్తుకుడి గుండా భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించారు. ఈ సమాచారంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని రాయబార, ఐబీ వర్గాలు విచారిస్తున్నాయి. 2015లో మాల్దీవుల ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన అహ్మద్ అదీబ్‌పై అక్కడ అనేక ఆరోపణలు ఉన్నాయి. బాంబ్ పేలుళ్ల కేసులు కూడా ఉండడం, ఆయన్ను అరెస్టు చేసి, విడుదల కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో తూత్తుకుడి నుంచి ఈనెల 11న మాల్దీవులకు సరకుల లోడుతో ఓ నౌక వెళ్లింది. ఈనెల 27 ఆ నౌక అక్కడి నుంచి తిరుగు పయనం అయింది. ఇక్కడి నుంచి నౌక బయలు దేరిన క్రమంలో అందులో తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో 8 మంది ఇండోనేషియాకు చెందిన వారు. ఒకరు తమిళనాడుకు చెందిన వ్యక్తి. తిరుగు పయనంలో అదనంగా ఓ వ్యక్తి చేరడంతో తమిళనాడుకు చెందిన వ్యక్తికి అనుమానాలు రేకెత్తించాయి. తూత్తుకుడికి 30 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న సమయంలో తమిళనాడు వ్యక్తి సంబంధిత తమ సంస్థకు సమాచారం అందించారు. తిరుగు పయనంతో పది మంది వస్తున్నట్టుగా అతడు ఇచ్చిన సమాచారంతో ఇక్కడి పోలీసుల్ని అప్రమత్తం చేశారు. తూత్తుకుడి పోలీసులతో పాటు మెరైన్, కోస్టు గార్డ్ వర్గాలు అలర్ట్ అయ్యాయి. తూత్తుకుడికి 20 నాటికన్ మైళ్ల దూరంలో నౌక ఉండగా, దానిని చుట్టుముట్టారు. అందులో ఉన్న వ్యక్తి గురించి విచారించగా, ఆయన మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అహ్మద్ అదీబ్గా తేలింది. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా, భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఆయన్ను ఐబీ( ఇంటెలిజెన్స్ బ్యూరో) వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. తూత్తుకుడి ఓడరేవుకు చేరుకున్న అనంతరం రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆయన వద్ద విచారణ జరుపుతున్నారు. రాయబార కార్యాలయ వర్గాలు సైతం విచారణలో నిమగ్నం అయ్యాయి. కాగా, అక్రమ చొరబాటు వెలుగులోకి రావడంతో తూత్తుకుడి మార్గం గుండా విదేశీ శక్తులు భారత్‌లోకి చొరబడే పరిస్థితులు ఉండడం భద్రతా పరంగా ఆందోళన కల్గిస్తున్నది. దీంతో స్థానిక పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరకుల గోడౌన్లు, అక్కడి సంస్థల మీద నిఘా పెంచారు. -
అత్తగారి ముందు బికినీ
‘‘అత్త ఉన్నా నేను ఉత్తమ కోడలినే. మా అత్తమ్మ చాలా మంచిది’’ అంటున్నారు కరీనాకపూర్. పుట్టింట్లో లభించిన స్వేచ్ఛ, ఆనందం అత్తింట్లో లభిస్తే ఏ ఆడపిల్లకైనా అంతకన్నా కావల్సింది ఏముంటుంది? ఏ కొంతమందికో మాత్రమే ఆ ఆనందం దక్కుతుంది. అలాంటి అదృష్టవంతుల్లో నేనూ ఒకదాన్ని’’ అని కరీనా చెబుతూ -‘‘మా అత్తమ్మ వాళ్లింట్లో నన్ను కూతురిలా చూసుకుంటారు. అందుకే ఆనవాయితీ ప్రకారం సైఫ్ తల్లి నాకు అత్తమ్మ అయినా, నేను మాత్రం అమ్మలానే భావిస్తా. మనం ఉన్నది 2013లో... 1990ల్లో కాదు. కానీ కొంతమంది అత్తలు పాత తరంలో ఉండిపోతారు. మా అత్తగారు మాత్రం ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టే ఉంటారు. నా వృత్తినీ వ్యక్తిగత జీవితాన్ని విడివిడిగా చూస్తారామె. అందుకే పెళ్లయినా నిర్భయంగా నేను సినిమాలు చేసుకోగలుగుతున్నాను. ఇక, వ్యక్తిగతంగా మా అత్తగారిచ్చే స్వేచ్ఛ గురించి ఓ ఉదాహరణ చెప్పాలంటే.. ఆ మధ్య మేం మాల్దీవులు వెళ్లాం. అక్కడి సాగర తీరంలో బాగా ఎంజాయ్ చేశాం. నేనైతే బికినీ వేసుకున్నాను. నాకు తెలిసి ఏ కోడలూ అత్త ముందు ఇలా చేయడానికి సాహసించదు. కానీ సందర్భానికి తగ్గట్టు వస్త్రధారణ చేసుకోవడం తప్పు కాదన్నది మా అత్తగారి అభిప్రాయం. ఇలా ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆలోచించే అత్తకి కోడలవ్వడం నేను చేసుకున్న పుణ్యం’’ అన్నారు.