ఎవరితో డేటింగ్ చేస్తే మీకెందుకు? | Who cares about interracial relationships?: Khloe Kardashian | Sakshi
Sakshi News home page

ఎవరితో డేటింగ్ చేస్తే మీకెందుకు?

Published Mon, Oct 31 2016 1:49 PM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

ఎవరితో డేటింగ్ చేస్తే మీకెందుకు?

ఎవరితో డేటింగ్ చేస్తే మీకెందుకు?

లాస్ ఏంజెలెస్: తాను ఎవరితో డేటింగ్ చేస్తే మీకెందుకని అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్ ఖ్లోయె కర్దాషియన్ ప్రశ్నించింది. వేరే జాతికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడితే తప్పేంటని అంది. 'కీపింగ్ అప్ విత్ ది కర్దాషియన్స్' స్టార్ ప్రస్తుతం కెనడా బాస్కెట్ బాల్ ప్లేయర్ ట్రిస్టాన్ థామ్సన్ తో డేటింగ్ చేస్తోంది. వీరి ప్రేమ వ్యవహారంపై పలువురు విమర్శలు గుప్పించారు. నల్లజాతీయుడిని ఎందుకు ప్రేమిస్తున్నావని కెల్ సే వెల్స్ అనే అభిమాని ఏకంగా ఖ్లోయె కర్దాషియన్ కు లేఖ రాశాడు.

దీనిపై ఆమె స్పందిస్తూ... 'ఇంత ప్రధానమైన విషయం గురించి మాట్లాడినందుకు కెల్ సే వెల్స్ కు ధన్యవాదాలు. జాతివివక్ష, జాత్యాంహకారానికి నేను వ్యతిరేకం. వివక్ష ఏ రూపంలో ఉన్నా నేను సమర్థించను. వేరే జాతికి చెందిన వ్యక్తిని ప్రేమించడం తప్పు కాదు. ఇప్పటికీ కొంత మంది ఇలాంటి సంబంధాలను తప్పుబడుతుండడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. మనమంతా ఒక్కటే. మనుషులుగా అందరి పట్ల ప్రేమ కలిగివుండాలి. శరీర ఛాయ ఆధారంగా వివక్ష చూపడం తగద'ని ఖ్లోయె కర్దాషియన్ స్పష్టం చేసింది. తన భర్త, బాస్కెట్ బాల్ మాజీ ఆటగాడు లామర్ ఒడోమ్ నుంచి ఆమె విడిపోయిన తర్వాత ట్రిస్టాన్ థామ్సన్ కు కర్దాషియన్ దగ్గరైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement