ఇలా చేశావేంటి తమ్ముడు: టీవీ నటి ఆవేదన | Khloe Kardashian furious over Rob's engagement to Blac Chyna | Sakshi
Sakshi News home page

ఇలా చేశావేంటి తమ్ముడు: టీవీ నటి ఆవేదన

Published Sat, Apr 9 2016 9:37 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

ఇలా చేశావేంటి తమ్ముడు: టీవీ నటి ఆవేదన - Sakshi

ఇలా చేశావేంటి తమ్ముడు: టీవీ నటి ఆవేదన

లాస్‌ ఏంజిల్స్‌: తమ కుటుంబాన్ని తమ్ముడు రాబ్‌ మోసం చేశాడని ప్రముఖ హాలీవుడ్ టీవీ నటి ఖ్లోయి కర్దాషియన్‌ ఆవేదన చెందుతున్నది. నిన్నటివరకు బ్లాక్ చెనాతో ప్రేమాయణం నడిపిన రాబ్‌ ఇప్పుడు ఆమెను పెళ్లిచేసుకునేందుకు నిశ్చయించాడు. కుటుంబసభ్యులకు కూడా చెప్పకుండా ఆమెతో వివాహ నిశ్చితార్థం చేసుకున్నాడు.

నిజానికి రాబ్ బ్లాక్ చెనాతో ప్రణయ సల్లాపాలు నడుపడం కర్దాషియన్ కుటుంబానికి ఇష్టం లేదు. ప్రస్తుతం అతనితో డేటింగ్ చేస్లున్న బ్లాక్‌ ఒకప్పుడు టైగాతో ప్రేమాయణం నడిపింది. అతని బిడ్డకు తల్లయింది. ప్రస్తుతం టైగా రాబ్ సవతి సోదరి కిలీ జెన్నర్‌ (18)తో డేటింగ్ చేస్తుండగా.. బ్లాక్‌ రాబ్‌తో ప్రేమలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో టైగా మాజీ లవర్‌ బ్లాక్‌తో రాబ్ నిశ్చితార్థం చేసుకోవడం.. కుటుంబాన్ని తీవ్రంగా వెన్నుపోటు పొడవడమేనని ఖ్లోయి భావిస్తోంది. కుటుంబాన్ని ఏమాత్రం గౌరవించని అతని నిశ్చితార్థంపై స్పందించేది లేదని ఆమె స్పష్టం చేసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కనీసం నిశ్చితార్థ శుభాకాంక్షలు కూడా చెపబోనని ఆమె పేర్కొన్నదట. కర్దాషియన్ కుటుంబసభ్యులైన ఖ్లోయితోపాటు కిమ్‌ కర్దాషియన్‌ కూడా ఈ నిశ్చితార్థం వార్తలపై స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement