వాస్తవానికి దగ్గరగా... | yamini bhaskar 'keechaka' movie releases on 30th | Sakshi
Sakshi News home page

వాస్తవానికి దగ్గరగా...

Published Sun, Oct 25 2015 1:32 AM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM

వాస్తవానికి దగ్గరగా...

వాస్తవానికి దగ్గరగా...

హైదరాబాద్‌లోని పాత బస్తీలో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘కీచక’. యామినీ భాస్కర్, జ్వాలా కోటి ముఖ్య పాత్రల్లో ఎన్.వి.బి. చౌదరి దర్శకత్వంలో కిషోర్ పర్వత రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఫిక్షన్‌కు దూరంగా, రియాలిటీకి దగ్గరంగా ఉంటుందీ చిత్రం.  స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. 24 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. నిర్భయ చట్టం వచ్చినా సరే మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. ఈ సినిమా అలాంటి వారికి ఓ హెచ్చరిక ’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కమలాకర్, మాటలు: రామ్‌ప్రసాద్ యాదవ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement