సన్నీ లియోన్‌తో నటించడానికి సై! | Yes, Aamir Khan Will Work With Sunny Leone | Sakshi
Sakshi News home page

సన్నీ లియోన్‌తో నటించడానికి సై!

Published Wed, Jan 20 2016 3:57 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సన్నీ లియోన్‌తో నటించడానికి సై! - Sakshi

సన్నీ లియోన్‌తో నటించడానికి సై!

ముంబై: సన్నీ లియోన్‌కు ఇప్పుడు సోషల్‌ మీడియాలో, బాలీవుడ్‌లో ఊహించని మద్దతు లభిస్తోంది. ఓ టీవీ ఇంటర్వ్యూలో తన గతం గురించి అడిగిన చెత్త ప్రశ్నలకు కూడా ఎంతో నింపాదిగా, హుందాగా సమాధానం చెప్పిన ఈ బాలీవుడ్‌ బ్యూటీకి తాజాగా అనూహ్య మద్దతు లభించింది. అది బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్‌ నుంచి.. సన్నీ లియోన్‌ను ప్రశంసల్లో ముంచెత్తడమే కాదు.. ఆమెతో సంతోషంగా కలిసి నటిస్తానని ఆమీర్ చెప్పాడు.

'ఆ ఇంటర్వ్యూలో ఎంతో హుందాగా, సహనశీలంగా సన్నీ ప్రవర్తించింది. అక్కడ నేనున్నా ఇంటర్వ్యూయర్‌కి ఇవే సమాధానాలు చెప్పాలనుకునేవాడిని.. ఔను! సన్నీ.. నీతో కలిసి పనిచేయడం ఆనందిస్తాను. ఇంటర్వ్యూయర్ అడిగినట్టు నీ 'గతం'తో నాకు ఎలాంటి సమస్య లేదు. ఆనందంగా ఉండు. ఆశీస్సులు నీకు. - ఆమీర్' అంటూ ఆమిర్‌ఖాన్ తన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఖాతాల్లో పేర్కొన్నాడు.

ఆమిర్ స్పందనతో ఉబ్బితబ్బిబ్బైన సన్నీ ఆయన ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపింది. ఆమిర్ వ్యాఖ్యలు చూసి తన హృదయంతో ఆనందంతో ఉప్పొంగిపోయిందని ఆమె పేర్కొంది. ఒకప్పుడు పోర్న్ స్టార్‌గా పనిచేసిన తన గతం గురించి ఓ టీవీ ఇంటర్వ్యూలో అడిగిన అభ్యంతరకర ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో సన్నీ చూపిన స్థిరచిత్తం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement