కొట్రలో మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా (ఫైల్)
వెల్దండ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీరు అందించడానికి ట్యాంకర్ యాజమానులు నిరాకరిస్తున్నారు. గతంలో మొక్కలకు నీరు అందించిన నేటికీ బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో 25ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీరు అందిస్తున్నారు. వేసవి సమీపిస్తుండడంతో మొక్కలకు నీరు అందించాలని అధికారులు ట్యాంకర్ యాజమానులతో మాట్లాడిన రావడం లేదు. కనీసం డీజిల్ ఖర్చులు, నీటిని నింపడానికి బిల్లులు కూడా అందించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
ముందుకురాని యజమానులు
హరితహరంలో భాగంగా మొక్కలు నాటడం, వాటికి నీరు అందించిన ట్యాంకర్ల యాజమానులకు మండలంలో దాదాపుగా రూ.10లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. గతేడాదిలో 6నెలల బిల్లులు చెల్లించలేదు. దాంతో మళ్లీ మొక్కలకు నీటిని పోసేందుకు ట్యాంకర్ల యజమానులు ముందుకు రావడం లేదు. పెండింగ్‌లో బిల్లులు చెల్లిస్తేనే మొక్కలకు నీరు అందిస్తామన్నారు. జిల్లా అధికారులు స్పందించి వెంటనే బిల్లులను చెల్లించాలని కోరుతున్నారు.
కూలీ కోసం ఎదురు చూపు
హరితహరంలో మొ క్కలు నాటిన కూలీల కు డబ్బులు నేటికీ అందలేదు. దాదాపుగా ఆరు నెలలుగా ఎదురుచూస్తున్న అధికారులు అందించడం లేదు. ఉన్నత అధికారులు స్పందించి పెండింగ్ బిల్లులను చెల్లించాలి.
– పద్మ, ఉపాధి హామీ కూలీ, కొట్ర
బిల్లులు రావడం లేదు
గతేడాదిలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నమాట వాస్తవమే. ఈ బిల్లుల నివేదికను జిల్లా అధికారులకు పంపాం. బడ్జెట్ లేకపోవడంతో బిల్లులు అలస్యం అవుతున్నాయి. హరితహారం మొక్కలకు వేసవిలో నీరు అందించడానికి ట్యాంకర్ల యాజమానులు ముందుకు రావడం లేదు. దాదాపుగా రూ.10లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
– వెంకటేశ్వర్లరావు, ఎంపీడీఓ, వెల్దండ
Comments
Please login to add a commentAdd a comment