
సాక్షి, సికింద్రాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరిత హారం కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా బోయగూడలో నూతన పార్కును మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, అధికారులు పార్కులో మొక్కలు నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అధికారులు మొక్కలు నాటారు. హరిత తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా అందరూ మొక్కలు నాటాలని మంత్రులు పిలునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment