Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Silly: CSK Coach Fumes At Reporter Questioning Team Strategy Loss To RCB1
ఇదేం ప్రశ్న? ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడాలి: సీఎస్‌కే కోచ్‌ ఆగ్రహం

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) కంచుకోటను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) ఎట్టకేలకు బద్దలు కొట్టింది. పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చెపాక్‌లో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా ఆర్సీబీ ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.మరోవైపు.. సొంతగడ్డపై ఆర్సీబీ చేతిలో పరాభవాన్ని సీఎస్‌కే జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన చెన్నై జట్టు హెడ్‌కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రుతురాజ్‌ సేన బ్యాటింగ్‌ తీరును ఉద్దేశించి ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్న అతడికి ఆగ్రహం తెప్పించింది.కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)- 2025లో తమ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై.. చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌తో తలపడింది. చెపాక్‌లో ఈ మాజీ చాంపియన్ల మధ్య జరిగిన పోరులో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత ముంబైని 155 పరుగులకు కట్టడి చేసిన సీఎస్‌కే.. 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.పాటిదార్‌, టిమ్‌ డేవిడ్‌ మెరుపులుతాజాగా ఆర్సీబీతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగుల మేర మంచి స్కోరు రాబట్టింది.ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌ (16 బంతుల్లో 32), విరాట్‌ కోహ్లి (30 బంతుల్లో 31)లతో పాటు దేవదత్‌ పడిక్కల్‌ (14 బంతుల్లో 27) రాణించగా.. కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (32 బంతుల్లో 51), టిమ్‌ డేవిడ్‌ (8 బంతుల్లో 22) మెరుపులు మెరిపించారు.అయితే, లక్ష్య ఛేదనలో చెన్నై ఆరంభం నుంచే తడబడింది. టాపార్డర్‌లో ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి (5), వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (0) పూర్తిగా విఫలం కాగా.. మరో ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర (31 బంతుల్లో 41) ఫర్వాలేదనిపించాడు.ధోని ధనాధన్‌ సరిపోలేదుమిగతా వాళ్లలో రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25), మహేంద్ర సింగ్‌ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్‌) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 146 పరుగుల వద్ద చెన్నై నిలిచిపోయింది. ఫలితంగా యాభై పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది.A never ending story 😊Last over 🤝 MS Dhoni superhits 🔥Scorecard ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB | @ChennaiIPL pic.twitter.com/j5USqXvf7r— IndianPremierLeague (@IPL) March 28, 2025అవుట్‌డేటెడ్‌ అంటూ సెటైర్లుఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం సీఎస్‌కే కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ మీడియా ముందుకు రాగా.. ‘‘తొలి మ్యాచ్‌లో 20 ఓవర్లలో మీరు 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఈరోజు 146 పరుగులు చేశారు.మీ బ్రాండ్‌ క్రికెట్‌ ఇలాగే ఉంటుందని తెలుసు. కానీ ఇది పాతబడి పోయిందని మీకు అనిపించడం లేదా?’’ అని ఓ రిపోర్టర్‌ ప్రశ్నించారు.ఇందుకు బదులుగా.. ‘‘నా బ్రాండ్‌ క్రికెట్‌ అంటే ఏమిటి? మీరు ఫైర్‌ పవర్‌ గురించి మాట్లాడుతున్నారా? మా జట్టు సత్తా ఏమిటో అందరికీ తెలుసు. అసలు మీ ప్రశ్న ఏమిటో నాకు అర్థం కావడమే లేదు.మమ్మల్ని తక్కువ చేయకండితొలి బంతి నుంచే మేము స్వింగ్‌ చేయడం లేదని మీరిలా అంటున్నారా? మా వ్యూహాల గురించి సానుకూలంగా ఆలోచించడంలో తప్పేముంది? గెలుపు కోసమే ఎవరైనా ప్రయత్నిస్తారు. దీనినే సానుకూల దృక్పథం (పాజిటివ్‌ బ్రాండ్‌ ఆఫ్‌ క్రికెట్‌) అంటారు.మమ్మల్ని తక్కువగా అంచనా వేయడం.. మా గురించి తక్కువగా మాట్లాడటం చేయకండి. ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడండి! ’’ అని ఫ్లెమింగ్‌ ఒకింత అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇందుకు సదరు జర్నలిస్టు.. ‘‘నేను మిమ్మల్ని తక్కువ చేసి చూపడటం లేదు’’అని సమాధానమిచ్చారు. దీంతో.. ‘‘మీరు అలాగే మాట్లాడుతున్నారు.. అర్థంపర్థంలేని ప్రశ్నలు వేస్తున్నారు’’ అని ఫ్లెమింగ్‌ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చాడు. అదే విధంగా.. చెపాక్‌లో ఆడటం వల్ల తమకు అదనపు ప్రయోజనాలేమీ ఉండవని.. ఇతర వేదికలపై తమ జట్టు సత్తా చాటిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఫ్లెమింగ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!

Phone Tapping Case: Shravan Rao SIT Inquiry Updates2
ట్యాపింగ్‌ కేసులో వీడిన ఉత్కంఠ.. సిట్‌ ఎదుటకు శ్రవణ్‌ రావు

హైదరాబాద్‌, సాక్షి: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఉత్కంఠకు తెర పడింది. మీడియా సంస్థ నిర్వాహకుడు, ఈ కేసులో నిందితుడు శ్రవణ్ రావు సిట్‌ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఎదుట హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఏ6 నిందితుడిగా ఉన్న శ్రవణ్‌ కుమార్‌కు ఈ నెల 26వ తేదీన సిట్‌ నోటీసులు జారీ చేసింది. 29వ తేదీన తమ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాల్సిందిగా తెలిపింది. ఆయన అమెరికాలో ఉండడంతో కుటుంబ సభ్యులకు ఆ నోటీసులను అందజేసింది. అయితే ఈలోపు అరెస్ట్‌ నుంచి ఆయనకు సుప్రీం కోర్టు ఊరట ఇచ్చింది. అయినప్పటికీ ఈ కేసులో విచారణకు సహకరించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం షరతు విధించింది. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు. మరోవైపు.. శ్రవణ్‌ రావు విచారణకు కచ్చితంగా హాజరు అవుతారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ వేకువఝామున విమానంలో ఆయన నగరానికి వచ్చారని తెలుస్తోంది. ఈ కేసులో శ్రవణ్‌ వాంగ్మూలం కీలకంగా మారవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శ్రవణ్‌ వెర్షన్‌ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఫోన్‌​ ట్యాపింగ్‌ వ్యవహారంలో.. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో శ్రవణ్‌ రావు సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులు నడుచుకున్నారనేది దర్యాప్తుసంస్థ ప్రధాన అభియోగం. ఓ మీడియా సంస్థకు అధిపతిగా ఉంటూ 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూర్చారని.. కాంగ్రెస్‌ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని ఈయనే సూచించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన్ను విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. గతేడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నమోదైన వెంటనే ఆయన తొలుత లండన్‌కు.. అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. సిట్‌ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే ఆయనపై రెడ్‌కార్నర్‌ నోటీస్‌ సైతం జారీ అయింది. అయితే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ నిరాకరించడంతో.. సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు వేసి ఊరట పొందినప్పటికీ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Karnataka Elderly Couple Loses Lakhs To Cyber Fraud Next Did This3
మా వల్ల కావట్లేదు.. ఎవరి దయ మీదా బతకాలనుకోవడం లేదు

బెంగళూరు: వీడియో కాల్‌ చేసి.. ఆపై నగ్నఫొటోలున్నయంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య తరచూ చూస్తున్నదే. అయితే అలాంటి సైబర్‌ నేరంలో చిక్కుకుని.. వాళ్ల బెదిరింపులకు భయపడి వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పైగా అప్పటికే రూ.50 లక్షలు చెల్లించిన ఆ జంట.. ఇంకా చేసేది లేక ఈ ఘాతుకానికి దిగింది.బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా బీడి గ్రామంలో గ్రామంలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి డియోగో నజరత్‌(83), పావీయా నజరత్‌(79) దంపతులు నివాసం ఉంటున్నారు. గత రెండు రోజులుగా ఇంటినుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో స్వసహయ సంఘం మహిళలు వెళ్లి చూడగా.. విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న నందగడ పోలీసులు వచ్చి పరిశీలించారు. డియోగో గొంతు, మణికట్టు వద్ద కత్తి కోసిన గాయం కనిపించింది. ఘటన స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభించింది. దీంతో మృతదేహాలను పోస్టుమార్టం కోసం బీమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ‘‘నా వయసు 82 ఏళ్లు.. నా భార్య వయసు 79 సంవత్సరాలు. ఈ వయసులో మాకు ఆదుకోవడానికి ఎవరూ లేరు. సమాజంలో ఎంతో గౌరవంగా ఇంతకాలం బతికాం. కానీ, ఇప్పుడు ఈ వేధింపులు భరించలేకపోతున్నాం. ఎవరిని సాయం అడిగి.. ఎవరి దయ మీదా బతకాలనీ అనుకోవడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని డియోగో స్వదస్తూరితో రాసిన లేఖ అది. నెల రోజులుగా వేధింపులు.. సూసైడ్‌ నోట్‌ ఆధారంగా కీలక విషయాలు వెలుగు చూశాయి. దంపతులను సైబర్‌ నేరగాళ్లు నెల రోజులుగా వేధిస్తున్నారు. తాము పోలీసులమంటూ పరిచయం చేసుకున్నారు. మా వద్ద మీ నగ్న చిత్రాలున్నయంటూ ఫోన్‌లో బెదిరించారు. అడిగినంత డబ్బులు ఇవ్వకంటే ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాలలో వైరల్‌ చేస్తామంటూ బెదిరించారు. ఆ వేధింపులు తాళలేక రూ.50 లక్షలు చెల్లించారు. అయినా మరింత నగ­దు కావాలని ఒత్తిడి చేశారు. దీంతో బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకున్నారు. పావీయా నిద్ర­మాత్రాలు మింగి ఆత్మహత్య చేసుకుంది. డియాగో డెత్‌నోట్‌ రాసి చాకుతో గొంతు కోసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన స్థలాన్ని బెళగావి జిల్లా ఎస్పీ పరిశీలించి కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు.లేఖలో.. సుమిత్రా బిర్రా, అనిల్‌ యాదవ్‌ అనే ఇద్దరి పేర్లను డియాగో ప్రస్తావించారు. తాను న్యూఢిల్లీ నుంచి టెలికామ్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నానని సుమిత్రా , అనిల్ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుగా పరిచయం చేసుకుని మరీ బెదిరింపులకు దిగారట. నగ్నఫోల్‌కాల్స్‌ ఉన్నాయని.. సిమ్‌ కార్డ్‌ దుర్వినియోగం కింద చట్టపరమైన చర్యలు ఉంటాయని బెదిరించారట. అయితే.. అప్పటికే రూ.50 లక్షలు చెల్లించామని.. ఇంకా కావాలని డిమాండ్‌ చేశారని.. బంగారం మీద రుణం కూడా తీసుకుని చెల్లించామని లేఖలో డియాగో వాపోయాడు. స్నేహితుల వద్ద నుంచి తెచ్చిన అప్పును తన భార్య నగలు అమ్మి చెల్లించాలని సూసైడ్‌ నోట్‌లో కోరిన డియాగో.. తమ ఇద్దరి మృతదేహాలను మెడికల్‌ కాలేజీకి అప్పగించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com

Vijay Devarakonda Talk About His Fans In Tollywood Industry4
అలాంటి ఫ్యాన్స్‌ ఉండడం నా అదృష్టం: విజయ్‌ దేవరకొండ

కథా బలమున్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు సినిమా అభివృద్ధిలో ఒక స్టార్ హీరోగా తన వంతు కృషి చేస్తానని అన్నారు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). ఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన 'వాట్ ఇండియా థింక్స్ టుడే' కార్యక్రమంలో గెస్ట్ గా పాల్గొన్నారు విజయ్ దేవరకొండ. హీరోగా తన సక్సెస్, గ్లోబల్ గా తెచ్చుకున్న గుర్తింపు, పాన్ ఇండియా ట్రెండ్ లో టాలీవుడ్ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ వంటి అంశాలతో పాటు తన కొత్త సినిమా "కింగ్ డమ్" విశేషాలు ఈ కార్యక్రమంలో తెలిపారు.హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - హీరోగా గ్లోబల్ గుర్తింపు తెచ్చుకోవడం, ఇంతమంది అభిమానం పొందడం మాటల్లో చెప్పలేని సంతోషాన్నిస్తోంది. ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నా, ఏ కొద్ది మందికో దక్కే అవకాశమిది. మనం అన్నిసార్లూ సక్సెస్ ఫుల్ సినిమాలు చేయకపోవచ్చు. కానీ ప్రతి సందర్భంలో ప్రేమించే ఫ్యాన్స్ ఉండటం నా అదృష్టం. స్టార్ గా ఎదిగిన తర్వాత నాలో కలిగిన ఫీలింగ్ ఒక రిలీఫ్ లాంటిది. (చదవండి: లూసిఫర్‌2 కలెక్షన్ల సునామీ.. ప్రకటించిన మోహన్‌లాల్‌)మనం సాధించాల్సింది సాధించిన తర్వాత దక్కే సంతృప్తి అది. ఇప్పుడున్న టెక్నాలజీలో ప్రపంచం చాలా చిన్నదైంది. మనం K డ్రామాస్ చూస్తున్నాం, కొరియన్ బీటీఎస్ ను ఇష్టపడుతున్నాం. అలాంటప్పుడు సౌత్ సినిమాను నార్త్ ప్రేక్షకులు అభిమానించడంలో ఆశ్చర్యం లేదు. సక్సెస్, ట్రెండ్ అనేది ఒక సర్కిల్ అయితే అందులో ఇప్పుడు టాలీవుడ్ వంతు వచ్చింది. రేపు మరో ఇండస్ట్రీ లీడ్ తీసుకోవచ్చు. మన దగ్గర ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారు. నేను ప్రతి ఒక్కరితో వర్క్ చేయాలని అనుకుంటున్నా. దర్శకులు నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా తమ మొదటి సినిమా నాతో చేశారు. ఇవాళ నేనిక్కడ ఉన్నానంటే వారి కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది.రాజమౌళి గారు బాహుబలి తీసినప్పుడు అదొక పెద్ద రిస్క్. దాని ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ సాహసం చేశారు. ప్రతి ఇండస్ట్రీ ఇలాంటి స్ట్రగుల్ పడాలి. అప్పుడే ట్రెండ్ క్రియేట్ చేయగలదు. నా కొత్త సినిమా "కింగ్ డమ్"(Kingdom Movie) టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో తారక్ అన్న, తమిళంలో సూర్య, హిందీలో రణ్ బీర్ కపూర్ తమ వాయిస్ లతో మా టీజర్ ను మరింత ఎఫెక్టివ్ గా చేశారు. వారి వాయిస్ వల్ల మా టీజర్ ఇంకా బాగా ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది. ప్రేక్షకులకు సరికొత్త కథలు చెప్పాలి, టాలీవుడ్ సక్సెస్ లో నా వంతు కృషి చేయాలని ప్రయత్నిస్తున్నా. అన్నారు.

Sukma Dantewada border encounter Latest News5
Sukma: భారీ ఎన్‌కౌంటర్‌.. 20 మంది మావోయిస్టుల మృతి

రాయ్‌గఢ్‌: మరో భారీ ఎన్‌కౌంటర్‌తో ఛత్తీస్‌గఢ్‌ ఉలిక్కిపడింది. సుక్మా జిల్లాలో ఈ ఉదయం ఎదురు కాల్పులు చోటు చేసుకోగా.. ఇప్పటిదాకా 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. సుక్మా-దంతేవాడ సరిహద్దులో ఉప్పనల్లి వద్ద గోగుండ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా జరిపిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లింది. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనపర్చుకున్నారు. ఘనటలో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే కాల్పుల్లో మావోయిస్టు కమాండర్ డీవీసీఎం జగదీష్ మృతి చెందాడని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అధికారికంగా ధృవీకరణ కావాల్సి ఉంది.ప్రస్తుతం అక్కడ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. సుక్మా ఎస్పీ కిరణ్‌ చవాన్‌ పర్యవేక్షణలో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే.. గత మూడు నెలల్లో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్‌లలో 100 మంది దాకా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టడం గమనార్హం.ఈ ఏడాది జనవరిలో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన దాడుల్లో ఎనిమిది మంది మరణించారు. అదే నెల చివర్లో.. కూంబింగ్‌ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఫిబ్రవరిలో బీజాపూర్‌ జిల్లాలోనే జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు, ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు. బీజాపూర్‌-దంతెవాడ సరిహద్దుల్లోని.. గంగలూరు పరిధి ఆండ్రి దండకారణ్యంలో మార్చి 20వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు, ఓ డీఆర్‌జీ జవాన్‌ రాజు మరణించారు. అదే రోజున కాంకేర్‌ జిల్లా(Kanker Encounter) ఛోటెబేథియా కోరోస్కోడో గ్రామంలో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.మావోయిస్టు రహిత భారత్‌ లక్ష్యంగా ఆపరేషన్ కగార్‌(Operation Kagar) పేరిట హోం మంత్రి అమిత్‌ షా పర్యవేక్షణలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఇప్పటికే జరిగిన అనేక ఎన్‌కౌంటర్లలో భారీగా మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో.. ఆపరేషన్ కగార్‌ చర్యను ఖండిస్తూ మావోయిస్టులు స్పందించారు. మావోయిస్టు పశ్చిమ బస్తర్ కమిటి అధికార ప్రతినిధి మోహన్ పేరిట ఓ లేఖ విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ దాడులతో 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు మావోయిస్టులు, ఆదివాసీలను కలిపి మొత్తం 78 మందిని హతమార్చారని అందులో పేర్కొన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు ఏయే ప్రాంతాల్లో, ఎప్పుడు ఎన్‌కౌంటర్లు జరిగాయి.. ఎంతమంది చనిపోయారు.. వారి వివరాలను తెలుపుతూ మావోయిస్టు పశ్చిమ బస్తర్ కమిటి అధికార ప్రతినిధి మోహన్ లేఖను విడుదల చేశారు. పోరాటం విషయంలో రాజీపడబోమని వెల్లడించారు. మావోయిస్టుల ప్రభుత్వ హత్యలను ఖండిస్తూ ఏప్రిల్‌ 4వ తేదీన బీజాపూర్ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. ఈ లేఖ విడుదలైన మరుసటిరోజే మరో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకోవడం గమనార్హం.

Gold and Silver Price Today March 29th 20256
అమాంతం పెరిగిపోతున్న బంగారం ధరలు: నాలుగు రోజుల్లో..

ఉగాదికి ముందే బంగారం ధరలు తారాస్థాయికి చేరుతున్నాయి. వరుసగా నాలుగో రోజు గోల్డ్ రేటు ఎగిసిపడింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాంహైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 83,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 91,200 వద్ద నిలిచాయి. నిన్న రూ. 1050 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 1140 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు వరుసగా రూ. 200, రూ. 220 పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 200, రూ. 220 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 83,600 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 91,200 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 83,750 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 91,350 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మార్చి 29) కేజీ సిల్వర్ రేటు రూ. 1,13,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,04,000 వద్దనే ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

IPL 2025: RCB Captain Rajat Patidar Comments After Winning Match Against CSK7
మంచి స్కోర్‌ చేశాము.. సీఎస్‌కేను వారి సొంత ఇలాకాలో ఓడించడం చాలా ప్రత్యేకం: పాటిదార్‌

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. సీఎస్‌కేతో నిన్న (మార్చి 28) జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. కష్ట సాధ్యమైన పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసి 196 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం అద్భుతంగా బౌలింగ్‌ చేసి విజయంవంతంగా లక్ష్యాన్ని కాపాడుకుంది. బ్యాటింగ్‌లో రజత్‌ పాటిదార్‌ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిల్‌ సాల్ట్‌ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్‌), పడిక్కల్‌ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (8 బంతుల్లో 22 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) సత్తా చాటగా.. బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌ (4-0-21-3), లవింగ్‌స్టోన్‌ (4-0-28-2), యశ్‌ దయాల్‌ (3-0-18-2) మ్యాజిక్‌ చేశారు. ఫలితంగా ఆర్సీబీ సీఎస్‌కేను 17 ఏళ్ల తర్వాత వారి సొంత ఇలాకాలో ఓడించింది.ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత ‍ప్రదర్శనలతో ఆకట్టుకోగా.. సీఎస్‌కే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఓటమిపాలైంది. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన సీఎస్‌కే కీల​క సమయాల్లో క్యాచ్‌లు జారవిడచడంతో పాటు ఫీల్డింగ్‌లో అనవసర తప్పిదాలు చేసి అదనపు పరుగులు సమర్పించుకుంది. నూర్‌ అహ్మద్‌ (4-0-36-3), పతిరణ (4-0-36-2), ఖలీల్‌ అహ్మద్‌ (4-0-28-1) బాగానే బౌలింగ్‌ చేసినా మిగతా బౌలర్లు సామర్థ్యం మేరకు రాణించలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. స్లోగా ఉన్న పిచ్‌పై సీఎస్‌కే బౌలర్లు 20-30 పరుగులు అదనంగా ఇచ్చారు.అనంతరం కష్ట సాధ్యమైన ఛేదనలో సీఎస్‌కే బ్యాటర్లు ఆదిలోనే చేతులెత్తేశారు. కనీస పోరాటం కూడా చూపలేక మ్యాచ్‌ను ఆర్సీబీకి అప్పగించారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా రచిన్‌ రవీంద్ర (41) ఒక్కడే క్రీజ్‌లో నిలబడి ఏదో చేసే ప్రయత్నం చేశాడు. ఆఖర్లో ధోని (16 బంతుల్లో 30 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ షాట్లు ఆడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సీఎస్‌కేకు పిచ్‌ నుంచి కూడా ఎలాంటి సహకారం లభించలేదు. వికెట్‌ చాలా స్లోగా ఉండింది. కొత్త బంతి కూడా వారికి కలిసి రాలేదు.మ్యాచ్‌ అనంతరం విన్నింగ్‌ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ వికెట్‌పై మంచి స్కోర్‌ చేశాము. వికెట్‌ చాలా స్లోగా ఉండింది. బ్యాటర్లకు ఇది అంత సులభం కాదు. సీఎస్‌కేను వారి సొంత అభిమానుల మధ్య ఓడించడం చాలా ప్రత్యేకం. ఈ వికెట్‌పై ఛేజింగ్ చేయడం అంత సులభం కాదని తెలుసు. అందుకే 200 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. నేను క్రీజ్‌లో ఉన్నంత సేపు ప్రతి బంతికి భారీ షాట్‌ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఓ రకంగా సఫలమయ్యాను. స్పిన్నర్లకు ఈ ట్రాక్ చాలా ఉపయోగకరంగా ఉండింది. అందుకే ముందుగానే స్పిన్నర్లను బరిలోకి దించాలని అనుకున్నాము. లివింగ్‌స్టోన్ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. హాజిల్‌వుడ్‌ తన తొలి ఓవర్‌లో, ఆతర్వాత కొత్త బంతితో మ్యాజిక్‌ చేశాడు. ఈ రెండు సందర్భాలు మ్యాచ్‌ను మాకు అనుకూలంగా మార్చాయి. మేము పరుగులు సాధించగలిగినా వారి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.

Ugadi Special Recipes: 4 Different Ugadi Special Traditional Recipes8
ఉగాది రోజున నోరూరించే కమ్మని పిండివంటలు ఈజీగా చేసుకోండిలా..!

పూర్ణాలు..కావలసినవి: పచ్చిశనగ పప్పు – అర కేజీ, బెల్లం – అరకేజీ, యాలక్కాయలు – పది, బియ్యం – రెండు కప్పులు, పొట్టుతీసిన మినప గుళ్లు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, ఆయిల్‌ – డీప్‌ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ముందుగా మినప పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి. శనగ పప్పుని కూడా కడిగి గంట పాటు నానబెట్టాలి ∙నానిన బియ్యం మినప పప్పులని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి ∙నానిన శనగపప్పుని కుకర్‌లో వేసి రెండు గ్లాసులు నీళ్లు΄ోసి మూడు విజిల్స్‌ రానివ్వాలి ∙ఉడికిన శనగ పప్పులో బెల్లం వేసి మెత్తగా గరిటతో తిప్పుతూ దగ్గర పడేంత వరకు ఉడికించి, యాలుక్కాయల పొడి వేసి తిప్పి దించేయాలి ∙శనగపప్పు మిశ్రమం చల్లారాక, ఉండలుగా చుట్టుకోవాలి ∙బియ్యం, మినపగుళ్ల రుబ్బులో కొద్దిగా ఉప్పు వేసి తి΄్పాలి. ఇప్పుడు శనగ పప్పు ఉండలను ఈ పిండిలో ముంచి ఆయిల్‌లో డీప్‌ ఫ్రై చేయాలి ∙మీడియం మంట మీద గోల్డెన్‌ బ్రౌన్‌ రంగులోకి మారేంత వరకు వేయిస్తే తియ్యని పూర్ణాలు రెడీ.పరమాన్నం..కావలసినవి: బియ్యం – అర కప్పు, పాలు – కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, నెయ్యి – ముప్పావు కప్పు, జీడి పప్పు పలుకులు – రెండు టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి – అర టీస్పూను, పచ్చకర్పూరం – చిటికెడు. తయారీ: ముందుగా బియ్యాన్ని కడిగి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో పాలుపోసి కాయాలి. కాగిన పాలల్లో నానబెట్టిన బియ్యం వేసి తిప్పుతూ ఉడికించాలి. అన్నం మెత్తగా ఉడికాక దించి చల్లారనివ్వాలి. స్టవ్‌ మీద మరో బాణలి పెట్టుకుని నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తరువాత జీడి పప్పు పలుకులు వేసి గోల్డ్‌ కలర్‌లోకి మారేంత వరకు వేయించాలి. స్టవ్‌ మీద మరో పాత్ర పెట్టి బెల్లం తురుము వేయాలి. దీనిలో పావుకప్పు నీళ్లుపోసి సిరప్‌లా మారేవరకు ఉడికించి, చల్లారనివ్వాలి. బెల్లం సిరప్‌లోనే యాలకుల పొడి, పచ్చ కర్పూరం వేసి తిప్పాలి. బెల్లం సిరప్‌ చల్లారక అన్నంలో వేసి బాగా కలపాలి, దీనిలో మిగిలిన నెయ్యి, జీడిపప్పుతో గార్నిష్‌ చేస్తే పరమాన్నం రెడీ.మామిడికాయ పులిహోరకావలసినవి: బియ్యం – కప్పు, పచ్చిమామిడి కాయ – మీడియం సైజుది ఒకటి, పచ్చికొబ్బరి తురుము – అర కప్పు, ఆవాలు – టీస్పూను, మినప పప్పు – టీస్పూను, పచ్చిశనగ పప్పు – టీ స్పూను, వేరుశనగ గుళ్ళు – రెండు టేబుల్‌ స్పూన్లు, కరివేపాకు – మూడు రెమ్మలు, పచ్చిమిర్చి తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు, ఎండు మిర్చి – నాలుగు, మెంతులు – పావు టీస్పూను, ఆయిల్‌ – నాలుగు టేబుల్‌ స్పూన్లు, పసుపు – పావు టీస్పూను, చింతపండు ఉసిరికాయంత, బెల్లం తురుము – రెండు టీస్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం పొడి పొడిగా వచ్చేలా వండి ఆరబెట్టుకోవాలి మామిడి కాయ తొక్క తీసి ముక్కలుగా తరగాలి. ఎండు మిర్చి, మెంతులు, అరటీస్పూను ఆవాలను దోరగా వేయించుకుని పొడిచేయాలి. ఈ పొడిలో పచ్చికొబ్బరి, మామిడికాయ ముక్కలు, చింతపండు, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్‌ చేసి పక్కనపెట్టుకోవాలి. స్టవ్‌ మీద బాణలి పెట్టి ఆయిల్‌ వేయాలి. ఆయిల్‌ వేడెక్కిన తరువాత ఆవాలు వేయాలి. చిటపటలాడాక మినప పప్పు, శనగ పప్పు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేయాలి ∙ఇవన్ని వేగాక వేరుశనగ గుళ్ళు వేసి వేయించాలి. ఇవి వేగాక పసుపు, గ్రైండ్‌ చేసిన మామిడికాయ మిశ్రమం వేసి ఐదు నిమిషాలు వేయించాలి ∙తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి, ఆరబెట్టిన అన్నాన్ని వేసి కలిపితే మామిడికాయ పులిహోర రెడీ. (చదవండి: 6 రుచులు... 6 ఆరోగ్య లాభాలు)

CBN, Pawan Silence On Rajahmundry Pharmacy Student Incident9
‘ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే నోరు మెదపరా?'

తూర్పుగోదావరి, సాక్షి: ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే సహించబోనని.. చెయ్యి వేసిన వాడి తాట తీస్తానని గతంలో పవన్‌ కల్యాణ్‌ ఎన్నో ప్రకటనలు ఇచ్చారు. మరి ఇప్పుడు ఆయనెక్కడ ఉన్నారు? అంటూ రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులు, ఆమె స్నేహితులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం దాకా వచ్చిన చంద్రబాబుకి.. ఇక్కడిదాకా వచ్చే టైం లేదా? అని అడుగుతున్నారు. మహిళా హోం మంత్రి అనితకు పరామర్శించే సమయమే లేదా? అని నిలదీస్తున్నారు. లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన డీ ఫార్మ్‌ ఫైనలియర్‌ విద్యార్థిని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమె చికిత్స పొందుతున్న రాజమండ్రి బొల్లినేని కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యమే వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నమూ చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని సమాచారం అందుతోంది. ఫార్మసీ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి కమిటీ వేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి వెంకటేశ్వరరావు సారథ్యంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం శుక్రవారం ఆసుపత్రికి వచ్చి విద్యార్థినికి అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యంపై ఇవాళ(శనివారం) హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయనున్నారు.బాధిత విద్యార్థిని డైరీలో రాసుకున్న సూసైడ్‌ నోట్‌తో ఆత్మహత్యా యత్నం బహిర్గతమైంది. నిందితుడు దీపక్ ఓ టీడీపీ ఎమ్మెల్యేకి బంధువు కావడంతో కేసును నీరు కారుస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగిన మూడు రోజుల దాకా అంతా గోప్యంగా ఉంచారని అంటున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆందోళన బాట పట్టారు. సీసీ ఫుటేజీ ఎక్కడ? బాధితురాలు వేకురోనీమ్‌ 10 ఎంజీ ఇంజక్షన్‌ తీసుకుందని.. దీనివల్ల బ్రెయిన్‌ డెడ్‌ అయ్యే ప్రమాదం ఉందని కొందరు పేర్కొంటుండగా.. ఇంకా బ్రెయిన్‌ డెడ్‌ కాలేదని ఆస్పత్రి యాజమాన్యం అంటోంది. మరి అంత ప్రమాదకరమైన ఇంజక్షన్‌ ఆమె చేతికి ఎలా వచ్చిoది? ఆమే చేసుకుందా..? ఎవరైనా ఇచ్చారా? సీసీ ఫుటేజీలో ఏం ఉంది? అనే దిశగా పోలీసు దర్యాప్తు చేయకపోవడం సందేహాలకు తావిస్తోంది. వాడిని చంపేయండి..! చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన చెల్లికి ఈ పరిస్థితి కల్పించిన దీపక్‌ను చంపేయాలని బాధితురాలి సోదరి, మేనత్త ఆగ్రహంతో మండిపడ్డారు. తన చెల్లెలు బాగా చదువుకునేదని, మంచి మార్కులతో ఫార్మసీ పూర్తి చేసే లోపు ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి లోపల ఏం జరుగుతోందో తెలియడం లేదని, ఎలాంటి వైద్యం అందిస్తున్నారో చెప్పడం లేదని బాధితురాలి అక్క విలపించింది. దీపక్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని మేనత్త డిమాండ్‌ చేసింది. సూసైడ్‌ లేఖ దొరక్కపోయి ఉంటే ఈ కేసును వేరే విధంగా మార్చేసేవారన్నారు.

Myanmar Thailand Bangkok Earthquake March 29 2025 Live Updates10
Earthquake Updates: 1,000 దాటిన మృతుల సంఖ్య

Earthquake Live Rescue OP Updates👉భారీగానే భూకంప మృతులు.. శిథిలాల కింద వందల మందిమయన్మార్‌, పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌కు భారీ భూకంపం తీరని నష్టం కలుగ జేసింది.ఇప్పటికే మృతుల సంఖ్య వెయ్యికి పైగా చేరిందిసగాయింగ్‌ కేంద్రంగా శుక్రవారం మధ్యాహ్నాం 12.50గం. 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపంనిమిషాల వ్యవధిలో మరో భారీ భూకంపం.. ఆపై స్వల్ప తీవ్రతతో పలుమార్లు కంపించిన భూమికేవలం 10 కి.మీ. లోతులో భూకంపం ఏర్పడడంతో భారీ నష్టంఈ ప్రభావంతో పొరుగున ఉన్న.. భారత్‌, చైనా, కంబోడియా, లావోస్‌, బంగ్లాదేశ్‌లలోనూ కంపించిన భూమి థాయ్‌లాండ్‌లో ఛాటుఛక్‌ మార్కెట్‌లో కుప్పకూలిన నిర్మాణంలోని భారీ భవనం10 మంది మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న 100 మందిప్రపంచ దేశాల తక్షణ సాయంఏ దేశమైనా సరే.. ఏ సంస్థ అయినా సరే.. మయన్మార్‌కు ఆపన్న హస్తం అందించాలని ప్రపంచ దేశాల సాయం కోరుతున్న జుంటూ మిలిటరీ చీఫ్‌ అవుంగ్‌తక్షణమే స్పందించి సాయానికి ఆదేశించిన ప్రధాని మోదీభారత్‌ తరఫున ‍ప్రత్యేక విమానాల్లో ఇప్పటికే చేరుకున్న సాయపు సామాగ్రియూరప్‌ దేశాలతో పాటు అమెరికా సాయం ప్రకటనథాయ్‌లో భారతీయులు సేఫ్‌భూకంపంపై అత్యవసర సమావేశం నిర్వహించిన థాయ్‌ ప్రధాని షినవత్రాభారతీయులంతా సురక్షితంగానే ఉన్నారని ప్రకటించిన ఎంబసీఅయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలంటూ సూచన👉వెయ్యి దాటిన భూకంప మృతులుమయన్మార్‌, థాయ్‌లాండ్‌లో వెయ్యి దాటిన మృతుల సంఖ్యమయన్మార్‌లోనే మృతులు అత్యధికంశిథిలాల నుంచి పలువురిని రక్షిస్తున్న సహాయక బృందాలు 👉 మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో మృత్యు ఘోషభారీ భూకంపంతో రెండు దేశాల్లో మృత్యు ఘోషమయన్మార్‌, థాయ్‌లాండ్‌లో 700కి పెరిగిన భూకంప మృతుల సంఖ్యఒక్క మయన్మార్‌లోనే 694 మంది మృతి, 1500 మందికి పైగా గాయాలుబ్యాంకాక్‌లో ఇప్పటిదాకా 10 మంది మృతి చెందినట్లు ప్రకటనసహాయక చర్యల్లో భాగంగా.. శిథిలాల నుంచి బయటపడుతున్న మృతదేహాలు సజీవంగా బయటపడుతున్నవాళ్ల సంఖ్య తక్కువేరెండు దేశాల్లోనూ కొనసాగుతున్న సహాయక చర్యలుమయన్మార్‌లో కూలిపోయిన సగాయింగ్‌ బ్రిడ్జిశిథిలా కింద చిక్కుకున్న వాళ్లను కాపాండేందుకు రెస్క్యూ టీం సహాయంమృతుల సంఖ్య 10వేలకు పైగా ఉండొచ్చని అమెరికా సంస్థ అంచనా 👉 భూకంపం ధాటికి బ్యాంకాక్‌లో కుప్పకూలిన భారీ భవనంకుప్పకూలిన 33 అంతస్తుల భవనంనాలుగు మృతదేహాల వెలికితీత90 మంది ఆచూకీ గల్లంతుకొనసాగుతున్న శిథిలాల తొలగింపు👉మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో ప్రకృతి విలయం200 దాటిన మృతుల సంఖ్యమయన్మార్‌లో నేలమట్టమైన 40 భారీ అపార్ట్‌మెంట్లుబ్యాంకాక్‌లోనూ కూలిన భవనాలుశిథిలాల కింద వందలాది మంది.. కొనసాగుతున్న సహాయక చర్యలురక్షించాలంటూ శిథిలాల నుంచి కేకలుఅయినవాళ్ల కోసం కన్నీళ్లతో గాలిస్తున్న పలువురుమృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అంచనా👉అఫ్గాన్‌లో భూకంపంరిక్టర్‌ స్కేల్‌పై 4.7 తీవ్రత నమోదుఉదయం 5.16 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు తెలిపిన నేషనల్ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ👉భూకంప బాధితులకు భారత్‌ ఆపన్న హస్తం15 టన్నుల సహాయక సామగ్రిని మయన్మార్‌కు పంపించిన భారత్గుడారాలు, స్లీపింగ్ బ్యాగ్స్, ఆహార పొట్లాలు, సోలార్‌ లైట్లు, ఔషధాలను మిలిటరీ విమానంలో పంపించినట్లు వెల్లడించిన విదేశాంగశాఖ 👉మయన్మార్‌లో మళ్లీ భూకంపంమయన్మార్‌ను వణికించిన మరో భూకంపంసహాయక చర్యలు కొనసాగుతుండగానే గతరాత్రి మళ్లీ భూకంపం4.2 తీవ్రతతో మళ్లీ ప్రకంపనలునిన్నటి భూకంపం ధాటికి 200 మంది మరణించినట్లు ప్రకటించిన అధికారులుఇంకా భారీగా మృతులు ఉండే అవకాశంవెయ్యి మంది మరణించి ఉండొచ్చని అంచనా వేస్తున్న అమెరికా భూకంపం సర్వే సంస్థ👉 థాయ్‌లాండ్‌లో కొనసాగుతున్న ఎమర్జెన్సీథాయ్‌లాండ్‌లో భూకంపంతో అత్యవసర పరిస్థితి ప్రకటనఉత్తర థాయ్‌లాండ్‌లో తీవ్ర నష్టంరాజధాని బ్యాంకాక్‌ అతలాకుతలంకొనసాగుతున్న శిథిలాల తొలగింపు భారీ సంఖ్యలో మృతులు ఉండే అవకాశంA huge earthquake hits Bangkok Capita Thai and Mayanmar.#trending #breakingnews #viralreels #viral #earthquake #bangkok #mayanmar #NEW pic.twitter.com/AoNn9P30Oq— Dr Maroof (@maroof2221) March 28, 2025👉హృదయ విదారకం మయన్మార్, థాయ్‌లాండ్‌ల్లో హృదయవిదారకంగా భూకంప దృశ్యాలు పలుచోట్ల కుప్పకూలిన భవనాలు, నిర్మాణాల కింద నుంచి హాహాకారాలు స్కూల్స్‌, ఆఫీసులు, ఆస్పత్రులు.. ఇలా అన్ని కుప్పకూలిన వైనంశిథిలాల నడుమ తమవారి కోసం కన్నీటి మధ్యే వెదుక్కుంటున్న జనం కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు👉మయన్మార్‌, థాయ్‌లాండ్‌ను కుదిపేసిన భారీ భూకంపంకుప్పకూలిన భవనాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టంఇంకా శిథిలాల కిందే పలువురు.. కొనసాగుతున్న సహాయకచర్యలుమయన్మార్‌లో ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటనథాయ్‌లాండ్‌లో భారతీయుల సహాయార్థఇండియన్‌ ఎంబసీ హెల్ప్‌లైన్‌థాయ్‌లాండ్‌లో హెల్ఫ్‌లైన్‌ నెంబర్‌ +66618819218ఊహించని ప్రకృతి వికృతి చర్య.. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్‌ పాలిట భారీ భూకంపం గోరుచుట్టుపై రోకటిపోటుగా మారింది.టిబెట్‌ పీఠభూమి ప్రాంతంలో సంక్లిష్టమైన టెక్టానిక్‌ ఫలకాలపై ఉన్నందున మయన్మార్‌కు భూకంప ముప్పు ఎక్కువే. ఇక్కడ హెచ్చు తీవ్రతతో కూడిన భూకంపాలు పరిపాటి. భూమి పై పొరలోని ఇండో, బర్మా టెక్టానిక్‌ ఫలకాలు సమాంతరంగా కదలడమే తాజా భూకంపానికి కారణమని సైంటిస్టులు తేల్చారు. భూ ఫలకాల అంచులను ఫాల్ట్‌గా పిలుస్తారు. లక్షలాది ఏళ్ల కింద భారత ఉపఖండం ఆసియాను ఢీకొట్టడం వల్ల ఏర్పడ్డ సాగయింగ్‌ ఫాల్ట్‌గా పిలిచే పగుళ్ల వెంబడే తాజా భూకంపం చోటుచేసుకుంది. ఇక్కడ టెక్టానిక్‌ ఫలకాలు ఏటా 0.7 అంగుళాల చొప్పున పరస్పర వ్యతిరేక దిశలో కదులుతున్నాయి. ఫలితంగా పుట్టుకొచ్చే ఒత్తిడి భూకంపాలుగా మారుతుంటుంది. ఇక్కడ దశాబ్దానికి ఒక్క భారీ భూంకంపమన్నా నమోదవుతుంటుంది. మయన్మార్‌లో గత వందేళ్లలో 6కు మించిన తీవ్రతతో 14కు పైగా భూకంపాలు నమోదయ్యాయి. 1946లో 7.7, 1956లో 7.1 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. 1988 నాటి భూకంపానికి వేలాది మంది బలయ్యారు. 2011, 2016ల్లో కూడా 6.9 తీవ్రతతో భూకంపాలొచ్చాయి. 👉ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకుల్లా వణికిపోయిన థాయ్‌లాండ్, మయన్మార్‌మార్చి 28 శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇటు మయన్మార్‌లో.. 7.4 తీవ్రతతో సంభవించిన ప్రకంపనలు అటు థాయ్‌లాండ్‌లోనూ భారీ విధ్వంసం సృష్టించాయి. మయన్మార్‌లో 6.4 తీవ్రతతో మరోసారి భూమి కంపించగా తర్వాత కూడా మరో నాలుగైదు ప్రకంపనాలు వణికించాయి. ఇటు మయన్మార్‌లో.. అటు థాయ్‌ రాజధాని బ్యాంకాక్‌లో భారీ భవనాలు కళ్లముందే పేకమేడల్లా కుప్పకూలాయి. మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement