
మోదీని టార్గెట్ చేసిన రాహుల్‌పై బీజేపీ...
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన నిరాధార ఆరోపణలు, ప్రసంగం అనంతరం ప్రధానిని కౌగిలించుకోవడంపై బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. అవిశ్వాసంపై చర్చలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. యువత ప్రధానిని ఉపాధి అడిగితే పకోడీ చేసుకోమన్నారంటూ విమర్శించారు. దేశంలో నేడు నిరుద్యోగం తాండవిస్తోందన్నారు.
రాఫెల్ డీల్‌పై అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు.బక్కచిక్కిన రైతులను విస్మరించి బడా బాబులకు మోదీ సర్కార్ రుణ మాఫీ చేస్తోందని దుయ్యబట్టారు. కొద్దిమంది కుబేరులకే ప్రధాని సన్నిహితంగా ఉంటారని, వారి ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు. మోదీ మాయమాటలతో ప్రజలను తీవ్రంగా వంచించారని ఆరోపించారు.