సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు శుక్రవారం ఈసీ నోటీసులు జారీ చేసింది. తాను పోటీ చేస్తున్న అమేధి నియోజకవర్గంలో రాహుల్ ఫోటోలతో కూడిన బ్యానర్లను ఏర్పాటు చేసి ఆ పార్టీ ప్రకటించిన కనీస ఆదాయ హామీ పధకం పేరిట ‘ ఇప్పుడు న్యాయం జరుగుతుంది’ అనే నినాదాలను వాటిపై పొందుపరచడం పట్ల ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
దీనిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఈసీ ఆదేశించింది. స్ధానిక అధికారుల అనుమతి లేకుండానే ఈ బ్యానర్లను ఏర్పాటు చేశారని ఈసీ పేర్కొంది. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు అమేథిలో ఈ తరహా భారీ బ్యానర్లను గుర్తించి, కాంగ్రెస్ కార్యకర్తలను సంబంధిత పత్రాలు చూపాలని కోరగా వారు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని నోటీసులో ఈసీ పేర్కొంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే ఈసీ చర్యలు చేపడుతుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment