లవర్స్ పేరెంట్స్ ను మెప్పించాలంటే.. | 10 tips to impress your boyfriend's parents | Sakshi
Sakshi News home page

లవర్స్ పేరెంట్స్ ను మెప్పించాలంటే..

Published Sun, Mar 22 2015 6:18 PM | Last Updated on Sat, Sep 2 2017 11:14 PM

లవర్స్ పేరెంట్స్ ను మెప్పించాలంటే..

లవర్స్ పేరెంట్స్ ను మెప్పించాలంటే..

ముంబై: 'మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది మాటలు రావే ఎలా' అంటూ ముందు కొద్ది రోజులపాటు పాటలు పాడుకున్నా తర్వాత ఏదో ఒకలా తమ మనసుకు నచ్చిన వ్యక్తిని బాయ్ ఫ్రెండ్గా దగ్గర చేసుకోగలరు అమ్మాయిలు. వారిని చూపులతో ఇట్టే కట్టేయగలరు. కానీ, పూర్తిగా సొంతం చేసుకోవాలంటే మాత్రం కచ్చితంగా ఆ బాయ్ ప్రెండ్స్ తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి. కానీ ఇది పెద్ద సాహసమే. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్స్ను మెప్పించినంత ఈజీ కాదు వారి తల్లిదండ్రులను ఒప్పించడం. మెప్పించడం సంగతీ దేవుడెరుగు.. కనీసం వారి ముందుకు వెళ్లే సాహసం కూడా చేయలేరు.

అయితే, ఇదంతా కేవలం కొన్ని విషయాలపై అవగాహన లేక జరుగుతుందని, కొన్ని కిటుకులను అనుసరించడం ద్వారా వారి మనసును కూడా బాయ్ ఫ్రెండ్స్ మనసులకన్నా వేగంగా కట్టేయోచ్చంటున్నారు. ఒక్కసారి ఆ కిటుకులేమిటో చూస్తే.. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా.. అందుకే హుందాగా ఉండటమే కాకుండా కాస్త బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తే వారు చూపు మీపై నిలుస్తుందట. అలాగే, తొలిసారి కలిసేందుకు వెళుతున్నప్పుడు కాబోయే అత్తమామలకు కచ్చితంగా చేతిలో బహుమతి ఉండాలంటున్నారు. ఇక ఇంటర్వ్యూకు వెళ్లినట్లుగానే ముందుగా ప్రిపేర్ అయ్యి వెళ్లాలట. గబగబా మాట్లాడకుండా వారేం మాట్లాడుతున్నారో సావధానంగా వినాలి.

ఇంకా, ఆ సమయంలో అమ్మాయి మాట్లాడే మాటల్లో అబ్బాయిపైనే ఊహలున్నట్లుగా ఉండటంతోపాటు, అన్ని తెలిసిన అమ్మాయిలా ప్రవర్తించకూడదు. అబ్బాయిపక్కనే కూర్చోవలటకానీ చేతులు వేయకూడదని అంటున్నారు. గతంలో ఏవైన వాస్తవాలు తెలిసి ఉన్నా వాటిని ప్రస్తావించకుండా ఉంటాలట. మాట్లాడేముందు తప్పినిసరిగా వారి కళ్లలోకి చూస్తూ మాట్లాడితే మంచి ఇంప్రెషన్ ఉంటుందట. ఇన్ని చేసినా చివరికి వాళ్లు ప్రతికూల నిర్ణయం తీసుకుంటే మరో అవకాశం వారికిచ్చేలాగా మనసును సరిచేసుకోవాలేగానీ వారిపై తప్పుడు అభిప్రాయాలు ఏర్పరుచుకోకూడదట. ఇప్పుడు తెలిసిందిగా అమ్మాయిలు.. ఇక ఫాలో అయిపోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement