వార్ధా నుంచి ఢిల్లీకి 1,100 కి.మీ. పాదయాత్ర | 1100 kilometers walk from wardha to delhi | Sakshi
Sakshi News home page

వార్ధా నుంచి ఢిల్లీకి 1,100 కి.మీ. పాదయాత్ర

Published Wed, Mar 4 2015 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM

వార్ధా నుంచి ఢిల్లీకి 1,100 కి.మీ. పాదయాత్ర

వార్ధా నుంచి ఢిల్లీకి 1,100 కి.మీ. పాదయాత్ర

 భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై హజారే సమరశంఖం
 ముంబై: కేంద్రం ప్రతిపాదించిన భూసేకరణ చట్ట సవరణ బిల్లులోని రైతు వ్యతిరేక నిబంధనలపై సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే సమరశంఖం పూరించారు. ఈ నిబంధనలను ప్రభుత్వం ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు మహారాష్ట్రలోని వార్ధా నుంచి ఢిల్లీకి 1,100 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. వార్ధాలోని గాంధీ ఆశ్రమం నుంచి మొదలయ్యే యాత్ర ఢి ల్లీలోని రామ్‌లీలా మైదానంలో ముగుస్తుందన్నారు. ఈ యాత్రకు సుమారు 3 నెలల సమయం పడుతుందన్నారు. ఈ నెల 9న సేవాగ్రామ్‌లో జరిగే సమావేశంలో పాదయాత్ర షెడ్యూల్‌ను నిర్ణయిస్తామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement