landpooling
-
మా భూమి ఇస్తాం... తీసుకోండి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన ‘ఉప్పల్ భగాయత్’ను శివారు రైతులు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆ తరహాలోనే తమ ప్రాంతాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేయాలంటూ కోరుతున్నారు. భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ‘మీ భూమి ఇవ్వండి.. అభివృద్ధి చేస్తామం’టూ ఈ నెల ఐదున హెచ్ఎండీఏ మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసిన క్రమంలో శివారు ప్రాంతరైతులు భూములివ్వడం వల్ల కలిగే ఫలితాలను తెలుసుకుంటున్నారు. ఘట్కేసర్, కీసర, శంషాబాద్, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, శామీర్‌పేట, కొహెడ... ఇలా వివిధ ప్రాంతాల రైతులు తార్నాకలోని హెచ్ఎండీఏ కేంద్ర కార్యాలయంలో ల్యాండ్‌పూలింగ్ అధికారులను కలసి మాట్లాడుతున్నారు. ఈ నెల 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయా రైతులు చెప్పిన భూముల్లో పర్యటించి లేఅవుట్‌కు పనికొస్తాయా, లేదా అని అధికారులు నిర్ధారించుకొని ముందుకెళ్లనున్నారు. 50 ఎకరాలకు తగ్గకుండా... హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత ల్యాండ్‌పూలింగ్ పథకం, ఏరియా డెవలప్మెంట్ ప్లాన్, డెవలప్మెంట్ స్కీం 2017 జీవో ప్రకారం కనీసం 50 ఎకరాలకు తగ్గకుండా భూమి ఉండాలి. భూమిపై సంపూర్ణంగా భూయాజమాన్యపు పట్టా(టైటిల్ క్లియర్) ఉండాలి. ప్రతిపాదిత భూమి మాస్టర్‌ప్లాన్ ప్రకారం బఫర్‌జోన్, చెరువులు, ఫుల్ ట్యాంక్ లెవల్, ఓపెన్ స్పేస్‌లో ఉండరాదు. ఉప్పల్ భగాయత్ లేఅవుట్ తరహాలోనే అంతా అభివృద్ధి చేసిన స్థలంలోని ప్లాట్లలో సగం మేర రైతులకు కేటాయించనుంది. మిగతాసగం ప్లాట్లను హెచ్ఎండీఏనే వేలం వేసి ఆదాయాన్ని సమకూర్చుకోనుంది. మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చంతా హెచ్ఎండీఏనే భరిస్తుందన్నారు. స్వతహాగా... పట్టాదారుల అంగీకారంతో... హెచ్ఎండీఏ స్వతహాగా గుర్తించిన ప్రాంతాల్లో భూమి సేకరించి లేఅవుట్ అభివృద్ధి తీసుకునే అధికారం కూడా ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు ఇరువైపులా కిలోమీటర్ పరిధిలో మినీ నగరాలు అభివృద్ధి చేసేందుకు ఈ అధికారాలు ఉపయోగించుకునే దిశగా హెచ్ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంగీకరించిన రైతులతో అభివృద్ధి ఒప్పందం–జీపీఏ కుదుర్చుకుంటారు. ఇది ఆమోదం పొందిన ఆరునెలల్లోగా రోడ్లు, పాఠశాలలు, పార్కులు, పచ్చదనం, రవాణాసౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేసిన ప్లాట్లను సంబంధిత యజమానికి అప్పగిస్తారు. రోడ్డుకు అనుకొని ఉన్న భూముల యజమానులకు అక్కడే స్థలాన్నిచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తారు. మిగతాభూములకు లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. ప్లాట్లు కేటాయించిన తర్వాత ఆరునెలల్లోగా అక్కడ మౌలిక సదుపాయాల నిర్వహణ బాధ్యతను యజమానుల సంఘానికి అప్పగించేలా ల్యాండ్‌పూలింగ్ పథకంలో నిబంధనలు పొందుపరిచారు. మూడేళ్లలోగా మౌలిక సదుపాయాలను కల్పించకపోతే ప్రతినెలా ఆ భూమి మూల విలువ(బేసిక్ వాల్యూ)పై 0.5 శాతం పరిహారాన్ని చెల్లిస్తారు. మినీ నగరాలతోపాటే లాజిస్టిక్ హబ్‌లు... ల్యాండ్ పూలింగ్ పథకం కింద ఉదాహరణకు ఒక ప్రాంతంలో 100 ఎకరాలను రైతులు ఇచ్చారు. ఇందులో వస్తువు నిల్వ కేంద్రాలు(లాజిస్టిక్ హబ్)ల కోసం 20 ఎకరాలు పక్కన పెడితే, మిగతా 80 ఎకరాల్లో లే అవుట్‌ను అభివృద్ధి చేయాలి. మొత్తం మౌలిక వసతులు కల్పించగా 2,45,000 గజాలు ప్లాట్ల రూపంలో ఉంటుంది. రైతులతో కుదుర్చుకున్న అవగాహన ప్రకారం ఎకరాకు 1,500 గజాలు కేటాయించాలి. అంటే 2,45,000 గజాలలో 100 మంది రైతులకు 1,50,000 గజాలను ఇవ్వనుంది. మిగిలిన 90,000 గజాలలో ఉన్న ప్లాట్లను విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును అదే ప్రాంతంలో ఉన్న లాజిస్టిక్ హబ్‌కు కేటాయించి అభివృద్ధి చేయడం ద్వారా ఆ ప్రాంతానికి మంచి డిమాండ్ రానుంది. అటు నగరంపై పడుతున్న రవాణా, ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడం, ఇటు శివారు ప్రాంతాలను అభివృద్ధి వైపు తీసుకెళ్లేలా చేయడంలో ఈ ల్యాండ్ పూలింగ్ పథకం ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. -
ఎయిర్పోర్ట్ నిర్వాసితుల ఆందోళన
సాక్షి, కృష్ణా : గన్నవరం మండలంలోని అల్లాపురంలో ఎయిర్పోర్ట్ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. మూడేళైనా తమకు ప్రత్యామ్నయం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్లాట్స్‌లోకి రాకుండా ఫెన్సింగ్ వేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ముగ్గురు బలయ్యారంటూ నిర్వాసితులు మండిపడుతున్నారు. -
హెరిటేజ్ సమర్పించు.. భూ దందా
-
హెరిటేజ్ సమర్పించు.. ఆ 14 ఎకరాలు
సాక్షి, అమరావతి బ్యూరో : అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్నీతిని అమలుచేశారు. రాజ ధాని ఎంపికలో రాజధర్మం మంటగలిపారు. అధికారం చేపట్టిన నెలరోజుల్లోనే రాజధానిగా గుంటూరు జిల్లా తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలను ఎంపిక చేశారు. ఆ విషయాన్ని చంద్రబాబు గోప్యంగా ఉంచారు. తన కుటుంబ సంస్థలు, సన్నిహితులు, బినామీలు వేల ఎకరాల భూములను ఆ ప్రాంతంలో కొనుగోలు చేసేలా చేసి లక్షల కోట్లు దోపిడీ చేసిన వైనాన్ని ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ బాగోతంలో చంద్రబాబు కుటుంబ ప్రమేయాన్నీ నిజం చేస్తూ హెరిటేజ్ కోసం కూడా ఆనాడే 14.22 ఎకరాలను తాను ముందే అనుకున్న రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేశారు. తర్వాత అదే ప్రాంతంలో రాజధానిని ప్రకటించారు. అంతేకాక, ఈ ప్రాంతాన్ని ల్యాండ్‌పూలింగ్ పరిధిలోకి రాకుండా జాగ్రత్తపడ్డారు. ఇన్నర్ రింగ్‌రోడ్డును కూడా హెరిటేజ్ భూముల ముందు నుంచి వెళ్లేలా ‘మాస్టర్‌ప్లాన్’ రూపొందించినట్లు ‘సాక్షి’ తాజా పరిశోధనలో వెలుగుచూసింది. రాజధానిపై తప్పుదోవ పట్టించి మరీ.. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే గుంటూరు జిల్లా తాడికొండ, మంగ ళగిరి నియోజకవర్గాల పరిధిలో రాజధానిని ఎంపిక చేయాలని నిర్ణయించి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు తెరతీశారు. అందులో భాగంగా.. ఉద్దేశపూర్వకంగా రాజధాని ప్రాంతంపై ఇతర ప్రాంతాల పేర్లను ప్రచారంలోకి తెచ్చారు. కృష్ణా జిల్లా నూజివీడు, గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వంటి పలు ప్రాంతాలను రాజధానిగా ఎంపిక చేయనున్నారని ప్రచారంలోకి తెచ్చారు. దాంతో రాష్ట్రంలో ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతరులు ఆ ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేశారు. ఆ తర్వాత సీన్ పూర్తిగా మార్చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ, మంగళగిరి ప్రాంతాల్లో భూములు కొనుగోలు వ్యవహారం పూర్తయిన తరువాత చంద్రబాబు అసలు కథకు తెరతీశారు. ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసినట్లు 2014, డిసెంబర్ 28న ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఆ ప్రాంతంలో ఎకరా మార్కెట్ విలువ రూ.5లక్షలు ఉన్న భూముల ధరలు పెరిగిపోయాయి. ఎకరా మార్కెట్ ధర రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు చేరుకుంది. తద్వారా చంద్రబాబు, ఆయన బినామీలు, సన్నిహితులు వేలకోట్లు కొల్లగొట్టారు. పూలింగ్ నుంచి మినహాయింపు రాజధాని కోసం ప్రభుత్వం భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) ప్రక్రియ చేపడుతున్నట్లు 2015, జనవరి 1న నోటిఫికేషన్ జారీచేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని మొత్తం 29 గ్రామాలను ల్యాండ్ పూలింగ్ పరిధిలో చేర్చారు. కానీ, చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్, ఆయన సన్నిహితుడైన లింగమనేని సంస్థకు చెందిన భూములు ఉన్న తాడికొండ మండలం కంతేరు గ్రామాన్ని పూలింగ్ ప్రక్రియలో చేర్చనే లేదు. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామం వరకు ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకున్నారు. కానీ, నిడమర్రును ఆనుకునే ఉన్న కంతేరు ల్యాండ్ పూలింగ్‌లో లేకపోవడం గమనార్హం. చంద్రబాబు కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ పుడ్స్ కొనుగోలు చేసిన భూములతోపాటు, ఆయన సన్నిహిత సంస్థ లింగమనేని ఎస్టేట్స్‌కు చెందిన వందలాది ఎకరాలు కంతేరులోనే ఉన్నాయి. అమాంతం ధరలు పెరిగిన ఆ భూములన్నీ హెరిటేజ్, లింగమనేని ఎస్టేట్ గుప్పిట్లోనే ఉండేట్లుగా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆ అవినీతి బంధం డృఢమైంది.. లింగమనేని ఎస్టేట్స్ డైరెక్టర్ లింగమనేని రమేష్, ఆయన సోదరుడు వెంకట సూర్య రాజశేఖర్‌లు సీఎంకు అత్యంత సన్నిహితుడు, బినామీలే అన్న ఆరోపణలు ఉన్నాయి. కృష్ణా తీరంలో లింగమనేని ఎస్టేట్స్ అక్రమంగా నిర్మించిన భవనాన్నే సీఎం చంద్రబాబు తన అధికారిక నివాసంగా చేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో వందలాది ఎకరాలను లింగమనేని సంస్థ కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే.. రాజధాని కోసం సామాన్య రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం భూములు తీసుకోగా.. మరోవైపు సీఎం చంద్రబాబు మాత్రం తన బినామీలు, సన్నిహితుల భూముల ధరలు అమాంతంగా పెరిగేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడటం గమనార్హం. ఇన్నర్ రింగ్‌రోడ్డూ మెలికలు తిరిగింది.. రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా 250 అడుగుల వెడల్పుతో అమరావతి చూట్టూ ఇన్నర్‌రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆ ఇన్నర్‌రింగ్ రోడ్డు కచ్చితంగా హెరిటేజ్ సంస్థ భూముల ముందు నుంచే వెళ్తుండటం గమనార్హం. కంతేరులో సర్వే నంబర్ 27/3ఎ ముందు నుంచే వెళ్తోంది. అదే విధంగా హెరిటేజ్, లింగమనేని సంస్థల భూములన్నీ కూడా ఇన్నర్‌రింగ్‌కు రెండువైపులా ఉన్నాయి. అంతేగాక.. ఆ ఇన్నర్ రింగ్‌రోడ్డు కోసం భూసేకరణ పరిధిలో చేరకపోవడం గమనార్హం. ఈ రెండు సంస్థలకు ప్రయోజనం కలిగించేందుకే ఇన్నర్‌రింగ్ రోడ్డు మ్యాప్ రూపొందించారన్నది స్పష్టమవుతోంది. సీఎం అయిన నెల రోజులకే.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2014, జూన్ 8న ప్రమాణస్వీకారం చేశారు. అధికారిక రహస్యాలను కాపాడతానని కూడా ఆ ప్రమాణ స్వీకారంలో చెప్పారు. కానీ, అధికారిక రహస్యాలను తమ స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకున్నారు. రాజధాని ప్రాంత ఎంపిక వ్యవహారాన్ని తమ అక్రమ సంపాదనకు సాధనంగా చేసుకున్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెలరోజుల్లోనే ఈ అవినీతి వ్యూహానికి తెరతీశారు. అదెలాగంటే.. ♦ 2014, జూలై 7న గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో పలుచోట్ల హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ భూములు కొనుగోలు చేసింది. సర్వే నంబర్లు 27/3బి, 22/2ఎ, 63/1, 62/2బి, 27/3ఎలలో 7.21 ఎకరాలు కొనుగోలు చేయడం గమనార్హం. ఆ 7.21 ఎకరాలను రూ.67.68లక్షలకు కొనుగోలు చేశారు. ఈ భూములన్నీ కూడా విజయవాడకు చెందిన మొవ్వా శ్రీలక్ష్మి అనే ఆమె నుంచి కొన్నారు. ఆ భూములను కూడా మొవ్వా శ్రీలక్ష్మీ గతంలో జీపీఏ ద్వారానే పొందడం గమనార్హం. ♦ 2014, సెప్టెంబరు 8న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ కంతేరు గ్రామంలోనే మరోసారి భూములు కొనుగోలు చేసింది. సర్వే నంబర్లు 56, 63/2బిలలో ఉన్న 2.46 ఎకరాలను రూ.19.68లక్షలకు కొనుగోలు చేశారు. ఆ భూములను విజయవాడకు చెందిన చిగురుపాటి వెంకటగిరిధర్ అనే వ్యక్తి అంతకుముందు కొంతకాలం క్రితమే జీపీఏ ద్వారా పొందారు. ఆయన ఆ భూములనే హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు విక్రయించారు. ♦ 2014, సెప్టెంబరు 8న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ కంతేరులోనే మరికొన్ని భూములను కొనుగోలు చేసింది. సర్వే నంబర్లు 56, 63/1, 63/2బి లలో ఉన్న 4.55 ఎకరాలను కొన్నారు. ఆ 4.55 ఎకరాలను రూ.36.40లక్షలకు లింగమనేని ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థల నుంచి కొనుగోలు చేయడం గమనార్హం. ఇలా.. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ మొత్తం 14.22 ఎకరాలను రూ.1.23,76,000లకు కొనుగోలు చేసింది. ఆ భూములన్నీ గుంటూరు జిల్లా తాడికొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు పరిధిలో ఉన్నాయి. కానీ, ఆ భూములను పెదకాకాని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించడం గమనార్హం. -
టీడీపీ నాయకులు దద్దమ్మలు
► ధైర్యం ఉంటే ఎయిర్‌పోర్టుపై సీఎంను నిలదీయాలి ► ముడుపులు అందలేదని ల్యాండ్‌పూలింగ్ ఎక్స్పర్ట్ మౌనం ► పార్టీలకతీతంగా పోరాటానికి సిద్ధం కావాలన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కాకాణి, రామిరెడ్డి నెల్లూరు(వీఆర్సీసెంటర్): దగదర్తి మండలంలోని దామవరంలో ఎయిర్‌పోర్ట్‌ను రద్దు చేసి ఇతర జిల్లాకు తరలిస్తామని పెట్టుబడులశాఖ కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపినా టీడీపీ జిల్లా నాయకులు, మంత్రులు దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలోని మాగుంటలేఅవుట్‌లో ఉన్న వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జిల్లాకు తీసుకొచ్చిన ఎయిర్‌పోర్టును చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని, ఈ విషయంపై టీడీపీ నాయకులు స్పందించి సీఎం చంద్రబాబును నిలదీయాలని అన్నారు. మొదటి నుంచి టీడీపీ ప్రభుత్వం ఈ ఎయిర్‌పోర్టుపై భిన్నంగా వ్యవహరిస్తోందని, మొదట 2,200 ఎకరాలు అవసరమని, మరలా 600 ఎకరాలు సరిపోతాయని, 13 ఎకరాలు అవసరమవుతాయని, విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ వస్తోందని అన్నారు. చివరకు రైతులకు నష్టపరిహారం కింద ఇవ్వాల్సిన రూ.15 కోట్లు ఇవ్వడం ఇష్టంలేక ఎయిర్‌పోర్టును రద్దు చేశారన్నారు. టెండర్లు ఖరారయిన తర్వాత రద్దు నిర్ణయం ఏమిటని ప్రశ్నించారు. ముడుపులు అందకపోవడంతోనే.. ల్యాండ్ పూలింగ్ ఎక్స్పర్ట్ సీఎం చంద్రబాబుకు ముడుపులు అందకపోవడంతోనే ఎయిర్‌పోర్టును రద్దు చేశారని విమర్శించారు. చంద్రబాబు విదేశీ ప్రయాణానికి అయ్యే విమాన ఖర్చులంత లేని రూ.15 కోట్లు ఇవ్వడం ఇష్టం లేకనే ఎయిర్‌పోర్టు రద్దు చేశారని అన్నారు. జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటున్న టీడీపీ ప్రభుత్వంపై పోరాడేందుకు పార్టీలకతీతంగా కలసిరావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కొందరు టీడీపీ నాయకులు ఈ ప్రాంతంలోని భూముల రికార్డులను తారుమారు చేసి ఫ్యాక్టరీలు నిర్మించుకున్నారని, వారి ఒత్తిడి మేరకే ఎయిర్‌పోర్టు రద్దు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోందని ఆరోపించారు. రద్దు నిర్ణయాన్ని ఇప్పటికైనా పునరాలోచించాలని అన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుకుమార్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి బీద రమేష్, అల్లూరు మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి, కావలి కౌన్సిలర్ తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో రూ.500 కోట్ల స్కాం
విజయవాడ: విశాఖపట్టణం జిల్లా పరిధిలో జరిగిన ల్యాండ్ పూలింగ్ లో భారీ అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గురువారం ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ పేరిట రూ.500కోట్ల కుంభకోణం జరుగుతోందని అన్నారు. కుంభకోణంపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేదల భూమిపై బడా బాబులు కన్నేశారని అన్నారు. అసైన్డ్ భూములను కొనుగోలు చేసి కోట్లు కొల్లగొట్టాలని స్కెచ్ వేశారని ఆరోపించారు. భీమిలి ప్రాంతంలోనే ల్యాండ్ పూలింగ్ లో అత్యధికంగా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పారు. -
ఎయిర్‌పోర్టు నిర్వాసితులకు రూ.6.5కోట్ల విడుదల
సాక్షి, అమరావతి బ్యూరో : గన్నవరం విమానాశ్రయం విస్తరణకు ల్యాండ్‌పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తాత్కాలిక పరిహారం కోసం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రూ.6.50కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర మౌలిక వసతుల కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ జైన్ బుధవారం జీవో నంబరు 115 జారీ చేశారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం ప్రభుత్వం భూసమీకరణ విధానంలో భూములు సేకరించింది. ఈ విధానంలో 707మంది రైతులు 600 ఎకరాలను ఇచ్చారు. వారికి ఎకరాకు వెయ్యి గజాలు స్థలం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అప్పటి వరకు ఒక్కో రైతుకు జీవనభృతి కింద ఏడాదికి ఎకరాకు రూ.50వేలు చొప్పున ఇచ్చేందుకు అంగీకరించింది. ఉద్యానవన రైతులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద ఎకరాకు రూ.లక్ష చొప్పున ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఆ ప్రాంతంలో రైతు కూలీలకు కుటుంబానికి నెలకు రూ.2,500 చొప్పున పింఛను ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం రూ.6.50కోట్లు విడుదల చేసింది. -
భూసేకరణ చేస్తే సామూహిక ఆత్మహత్యలే
నేతలు, పాలకులకు తేల్చి చెప్పిన కొత్తగూడెం వాసులు కొత్తగూడెం (గన్నవరం) : పోలవరం కాలువ నిర్మాణం కోసం తమ ఇళ్లను బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని కొత్తగూడెం గ్రామస్తులు ప్రజాప్రతినిధులు, అధికారులకు తేల్చిచెప్పారు. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కాలువ డిజైన్ మార్చడంతో తాము ఇళ్లు కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. తమ ఇళ్లకు మినహాయింపు ఇవ్వకపోతే ఎమ్మెల్యే, అధికారుల ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు పోలవరం కాలువ నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, ప్రాజెక్టు ప్రత్యేక డెప్యూటీ కలెక్టర్ డి. సుదర్శనరావు, పలువురు అధికారులు గురువారం గ్రామాన్ని సందర్శించారు. తొలుత భూసేకరణకు గుర్తించిన ఇళ్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కాలువ నిర్మాణం కోసం 320 మీటర్ల వెడల్పున భూసేకరణ చేస్తున్నామని, పేదల ఇళ్లను మినహాయించేందుకు సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని, అధికారుల సర్వేకు సహకరించాలని కోరారు. ఎంపీపీ పట్రా కవిత, వైస్ ఎంపీపీ గొంది పరంధామయ్య, సర్పంచ్ కొండ్రు ఝాన్సీ, పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఆగమేఘాలపై సీఆర్డీఏ పరిధిలో చెక్కులు పంపణీ!
విజయవాడ: రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తుంది. రాజధాని ప్రాంత రైతులు, తమ భూములు బలవంతంగా లాక్కున్నారంటూ దేశ రాజధానిలో ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం ఆగమేఘాలపై సోమవారం రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుని చెక్కులు పంపిణీ చేసింది. అనంతరం చెక్కులు పంపిణీ చేసిన రైతుల పంట భూముల్లో ట్రాక్టర్లతో చదును కార్యక్రమం చేపట్టారు. తుళ్లూరు మండలం నేలపాడులో 93 ఎకరాలకు సంబంధించిన 36 మంది రైతులతో అప్పటికప్పుడు ఒప్పందాలు చేసుకుని భూములను స్వాధీనం చేసుకున్నారు. అక్కడికక్కడే ఎకరాకు రూ. 30 వేల చొప్పున రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. వెనువెంటనే నేలపాడు సర్పంచ్ సుబ్బారావు పొలంలో భూమి చదును చేసే కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం ప్రారంభించారు. భూ సమీకరణకు అంగీకారపత్రాలు ఇచ్చిన రైతులందరినీ పరిహారం వైపు మళ్లించడం, భవిష్యత్తులో న్యాయ వివాదాలు రాకుండా జాగ్రత్త పడటం కోసమే ఈ రకమైన ఎత్తుగడ వేశారని రాజధాని ప్రాంత రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తొలివిడత భూ సమీకరణ ముగిసిన వెంటనే అంగీకార పత్రాలు అందిన భూములకు సంబంధించి సర్వే నిర్వహించి అన్నీ సక్రమంగా ఉంటేనే ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం తొలుత భావించింది. రైతుల భూమి అధికారికంగా సీఆర్డీఏ చేతికి అందాక భూమిని చదును చేస్తామని సీఆర్డీఏ అధికారులు నిన్నటి వరకూ చెప్పారు. ఒప్పందాలు పూర్తయిన తర్వాత మాస్టర్‌ప్లాన్ వచ్చేలోపు భూములను చదును చేయాలని భావించారు. కానీ అవేమీ మొదలుకాకుండానే సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సోమవారం సాయంత్రమే భూములు స్వాధీన పరుచుకునే పని ప్రారంభించారు. . -
వార్ధా నుంచి ఢిల్లీకి 1,100 కి.మీ. పాదయాత్ర
భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై హజారే సమరశంఖం ముంబై: కేంద్రం ప్రతిపాదించిన భూసేకరణ చట్ట సవరణ బిల్లులోని రైతు వ్యతిరేక నిబంధనలపై సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే సమరశంఖం పూరించారు. ఈ నిబంధనలను ప్రభుత్వం ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు మహారాష్ట్రలోని వార్ధా నుంచి ఢిల్లీకి 1,100 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. వార్ధాలోని గాంధీ ఆశ్రమం నుంచి మొదలయ్యే యాత్ర ఢి ల్లీలోని రామ్‌లీలా మైదానంలో ముగుస్తుందన్నారు. ఈ యాత్రకు సుమారు 3 నెలల సమయం పడుతుందన్నారు. ఈ నెల 9న సేవాగ్రామ్‌లో జరిగే సమావేశంలో పాదయాత్ర షెడ్యూల్‌ను నిర్ణయిస్తామని చెప్పారు. -
'పెట్టుబడిదారుల కోసమే వేలాది ఎకరాల భూ సేకరణ'
బొబ్బిలి: ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ రెండు రాష్ట్రాలను పెట్టుబడి దారులకు కట్టబెడుతున్నారని విప్లవ రచయితల సంఘం(విరసం) రాష్ట్ర నాయకుడు కల్యాణ్‌రావు ఆరోపించారు. ఈ రెండూ ప్రజల ప్రభుత్వాలు కావన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలపై పోరాటానికి విప్లవం అనివార్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నిర్మాణం కోసం భూముల సేకరణ గురించి ఆలోచిస్తున్నారే గానీ, భూమిపై బతికే వారి గురించి ఆలోచించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలు అవసరం లేకపోయినా పెట్టుబడిదారుల కోసమే ప్రభుత్వం లక్ష ఎకరాల భూమిని సేకరిస్తోందని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం వెనుక కుట్ర దాగుందని, కొన్ని కంపెనీలతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలను పెట్టుబడి దారులకు ధారాదత్తం చేయాలని నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, ఇద్దరు సీఎంలు వేర్వేరు పార్టీలకు చెందినా, వారి పాలనా ముద్ర అంతా ఒక్కటేనన్నారు.