13 ఏళ్ల బాలికపై అత్యాచారం | 13 year old girl raped at Anand Parbat transit camp | Sakshi
Sakshi News home page

13 ఏళ్ల బాలికపై అత్యాచారం

Published Wed, Jan 4 2017 6:49 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

13 ఏళ్ల బాలికపై అత్యాచారం - Sakshi

13 ఏళ్ల బాలికపై అత్యాచారం

న్యూఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున ఓ బాలికపై అత్యాచారం జరిగింది. ఆనంద్‌ ప్రభాత్‌ ఏరియాలో ఓ పబ్లిక్‌ టాయ్‌లెట్‌లో ఇద్దరు యువకులు 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. బాలిక షాపుకెళ్లి తిరిగి వస్తుండగా పబ్లిక్ టాయ్‌లెట్‌ లోకి వెళ్లింది. అదే సమయంలో ఇద్దరు యువకులు ఆ బాలికను వెంబడించి టాయ్లెట్లోనే అఘాయిత్యానికి పాల్పడ్డారు.  

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన డిసెంబర్‌ 31న జరిగింది. బాధితురాలు ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి ఎవరికి చెప్పలేదు. ఆమెకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రిలో పరీక్షలు చేయగా అసలు విషయం వెలుగుచూసింది. పోలీసులు సెక్షన్‌ 376 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నిందితల్లో ఒకరు బాల నేరస్తుడని తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement