మాజీ సీఎంపై 15 కేసులు కొట్టివేత | 15 cases filed against Yeddyurappa were dismissed | Sakshi
Sakshi News home page

మాజీ సీఎంపై 15 కేసులు కొట్టివేత

Published Wed, Jan 6 2016 9:53 AM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM

15 cases filed against Yeddyurappa were dismissed

సాక్షి, బెంగళూరు: అక్రమ డీ-నోటిఫికేషన్‌కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్పపై నమోదైన 15 కేసులను కొట్టి వేస్తూ హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.  యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూముల డీ-నోటిఫికేషన్‌కు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారంటూ యడ్యూరప్పపై 15 కేసులు నమోదయ్యాయి. వీటన్నింటికి ఆధారాలు లేవని, వీటిని కొట్టి వేయాలని కోరుతూ యడ్యూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. 

విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి రత్నకళా 15 కేసులను కొట్టివేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది డిసెంబర్ 12న విచారణను పూర్తి చేసిన న్యాయమూర్తి రత్నకళా తీర్పును మంగళవారం వెలువరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement