
విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారం
ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కామంతో కళ్లు మూసుకుపోయి పశువులా ప్రవర్తించాడు. ముజఫర్నగర్ సమీపంలో ప్రైవేట్ స్కూల్ నడుపుతున్న ప్రిన్సిపాల్ దినేష్ కుమార్ ఆరో తరగతి విద్యార్థిని(15)ని అత్యాచారం చేశాడు. హోం వర్క్ పేరుతో బాలికను స్కూల్లోనే ఉంచుకుని దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెప్పవద్దంటూ బెదిరించాడు. బాధితురాలి ఇంటికి వెళ్లాక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రిన్సిపాల్ను అరెస్ట్ చేశారు.