లక్నో: ఉత్తరప్రదేశ్లోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ(కేజీఎమ్యూ)లో జూనియర్ డాక్టర్లు విధులకు హాజరుకాకుండా సమ్మె బాట పట్టడంతో 16 మంది రోగులు మృత్యువాత పడ్డారు. పీజీ అడ్మిషన్ ప్రక్రియలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంగళవారం నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చిన సుమారు 2000 మంది రోగులు వైద్య సహాయం అందక తిరుగుముఖం పట్టారు. అత్యవసర సేవలు అవసరమైన రోగులకు మాత్రమే సీనియర్ డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మెరిట్ లిస్ట్ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్రిల్లో నిర్ణయం తసుకుంది. అయితే దీని ప్రకారం పీజీ ప్రవేశాల్లో అడ్మిషన్ కోల్పోతున్న విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. గత మెరిట్ లిస్ట్ ప్రకారం అడ్మిషన్ పొందిన విద్యార్థులు మే 1 నుంచి జూనియర్ రెసిడెంట్ డాక్టర్లుగా సేవలందిస్తున్నారు. అయితే సవరించిన మెరిట్ లిస్ట్ను వ్యతిరేకిస్తున్న విద్యార్థులు.. ప్రభుత్వ నిర్ణయం వెనక్కితీసుకునే వరకు ఆందోళన కొనసాగుతుందంటున్నారు.
డాక్టర్ల సమ్మెతో 16 మంది రోగులు మృతి
Published Thu, Jun 2 2016 1:43 PM | Last Updated on Thu, Sep 19 2019 8:40 PM
Advertisement