కండక్టర్పై కానిస్టేబుళ్ల క్రౌర్యం | Sakshi
Sakshi News home page

కండక్టర్పై కానిస్టేబుళ్ల క్రౌర్యం

Published Thu, Jun 30 2016 12:55 PM

కండక్టర్పై కానిస్టేబుళ్ల క్రౌర్యం - Sakshi

న్యూఢిల్లీ: తమకు సంబంధించిన వారికి పార్సిల్ ఇచ్చేందుకు నిరాకరించాడని ఓ బస్ కండక్టర్ను ఇద్దరు కానిస్టేబుళ్లు చితకబాదారు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ వద్ద చోటుచేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు బయటకు రావడంతో ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను వేరే చోటుకి బదిలీ చేశారు.

అయితే, వారిపై కేసు నమోదుకావడంగానీ, ఆ కండక్టర్ కేసు పెట్టడంగానీ జరగలేదు. తమకు సంబంధించిన వారికి పార్సిల్ పంపించడం కోసం నీరజ్, నీరజ్ అనే ఇద్దరు వ్యక్తులు ఓ బస్సు కండక్టర్ వద్దకు వెళ్లి అడిగారు. వాళ్లు ఎలా అడిగారో.. అతడు ఏ సమాధానం చెప్పాడో తెలియదుగానీ వెంటనే గొడవ ప్రారంభమైంది. ఆ ఇద్దరు కలిసి బస్ కండక్టర్ని కొట్టడం ప్రారంభించారు. ఓ బాటసారి ఆ దృశ్యాన్ని తన మొబైల్లో బంధించాడు. ఏడు సెకన్ల నిడివితో కూడిన ఆ వీడియో బయటకు రావడంతో వారిద్దరికి సమన్లు పంపించి అక్కడి నుంచి జిల్లా విభాగంలోకి వారిని బదిలీ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement