
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో ఉన్న సంత్‌రాగాఛీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. స్టేషన్‌లోని వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లపైకి మూడు రైళ్లు ఒకేసారి వస్తున్నాయని ఆనౌన్స్‌మెంట్ వినిపించింది.
వెంటనే తమ రైలు మిస్సవ్వకూడదనే తొందరలో ప్రయాణికులంతా రెండో, మూడో ప్లాట్‌ఫామ్‌లను కలిపే ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపైకి చేరారు. దాంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి ఇద్దరు ప్రయాణికులు చనిపోయారని, 15 మంది గాయపడ్డారని వాయవ్య రైల్వే అధికార ప్రతినిధి సంజయ్ ఘోష్ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.1 లక్ష చొప్పున పరిహారం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment