stampedes
-
ప్రచార పిచ్చి.. పాలనా వైఫల్యం
సాక్షి, అమరావతి: తన పరిపాలన గురించి గొప్పగా అతిశయోక్తులు చెప్పుకునే చంద్రబాబు.. వాస్తవంలో మాత్రం చేతులెత్తేసి చోద్యం చూడడం మినహా ఏమీ చేయలేరని మరోసారి స్పష్టమైంది. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృత్యువాత పడటం, పలువురు క్షతగాత్రులవ్వడమే ఇందుకు నిదర్శనం. పాలనా వైఫల్యానికి, అసమర్థతకు ఇదో మచ్చుతునక. ఇదొక్కటే కాదు చంద్రబాబు హయాంలో అడుగడుగునా వ్యవస్థల వైఫల్యం కనిపిస్తుంది. ఇటీవలే బుడమేరు వరద నిర్వహణలో విఫలమై విజయవాడను ముంచేసి, లక్షలాది కుటుంబాలను రోడ్డుపాలు చేశారు. అంతకు ముందు 2015లో గోదావరి పుష్కరాల్లో తన ప్రచార పిచ్చితో తొక్కిసలాటకు కారణమై 29 మంది నిండు ప్రాణాలను బలి తీసుకున్నారు. గత ఎన్నికల సమయంలోనూ కందుకూరు, గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో ప్రజల ప్రాణాలను హరించారు. విజయవాడలో జరిగిన కృష్ణా నది బోటు ప్రమాదంలో 21 మంది మృత్యువాత పడటానికి కారకుడయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నిర్వహణా లోపాలు మలుపు మలుపులో కనిపిస్తాయి. ఈ లోపాల ఖరీదు పదుల సంఖ్యలో ప్రాణాలు పోవడం. పాలనా పరమైన సమర్థత లోపించడం వల్లే ఆయన హయాంలో తరచూ ప్రమాదాలు, తొక్కిస లాటలు జరుగుతున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏమాత్రం ప్రణాళిక ఉన్నా, నిర్వహణా సామర్థ్యం ఉన్నా.. ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి ఉండదు. వేలాది, లక్షలాది మంది వస్తారనే ముందస్తు సమాచారం ఉన్నా.. తరచూ జరిగే కార్యక్రమాలే అయినా తొక్కిసలాటలు జరగడానికి కారణం వ్యవస్థలు నీరుగారి పోవడమేనని చెబుతున్నారు. వైంకుఠ ద్వార దర్శనం 10 రోజులు ఉండగా, తొలి మూడు రోజులకు ఒకేసారి టికెట్లు ఇవ్వాలనుకోవడంలోనే ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది.అధికార యంత్రాంగాన్ని విచ్చలవిడిగా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తుండడంతో వారు తమ అసలైన కర్తవ్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు. తిరుమల యంత్రాంగాన్ని తన రాజకీయ ప్రాపకం కోసం వాడుకుని, అసలు పని చేయలేని పరిస్థితి కల్పించడం వల్లే ఇంతటి ఘోరం జరిగిందని చెబుతున్నారు. నాడు ప్రచార పిచ్చితో 29 మంది బలిచంద్రబాబు ప్రచార పిచ్చి, నిర్వహణా సామర్థ్యం లోపం వల్ల 2015 జూలై 14న గోదావరి పుష్కరాల సమయంలో రాజమండ్రిలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘోర ఘటనలో పుష్కర స్నానాల కోసం వచ్చిన 29 మంది మృత్యువాత పడ్డారు. పుష్కర ఘాట్‌లో కుటుంబంతో కలిసి స్నానానికి వచ్చిన చంద్రబాబు కోసం వేలాది మంది భక్తులను గంటల తరబడి క్యూలైన్లలో నిలిపివేశారు. తర్వాత ఒక్కసారిగా అందరినీ వదలడంతో తొక్కిసలాట జరిగింది. తన కుటుంబం పుష్కర స్నానం చేసే దృశ్యాలను ఒక అంతర్జాతీయ టెలివిజన్ చానల్ కోసం వీడియో షూట్ చేయించుకుంటూ వేలాది మంది భక్తులను క్యూలైన్లలో కుక్కిపడేశారు. చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ మృత్యుఘోషగా మారింది. కృష్ణా నదిలో బోటు బోల్తా.. 21 మంది మృతి2017 నవంబర్ 13న విజయవాడ–ఇబ్రహీంపట్నం మధ్య కృష్ణా నదిలో బోటు మునిగిపోయి 21 మంది మృతి చెందారు. అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అత్యంత బాధ్యతారాహిత్యంగా కృష్ణా నదిలో బోట్ల విహారానికి అనుమతిచ్చింది. నదీ ప్రవాహం, ఒరవడి గురించి ఏమాత్రం అవగాహన లేకుండా కేవలం టూరిజం పేరుతో జరిగే ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ బోటు ప్రమాదానికి కారణమయ్యారు. డ్రోన్ షో కోసం ఎనిమిది నిండు ప్రాణాలు బలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన స్వార్థం కోసం ఇరుకురోడ్డులో రోడ్‌షోలు నిర్వహించి జనాన్ని బలి తీసుకున్నారు. 2022 డిసెంబర్ 29న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో రోడ్‌షో నిర్వహించినప్పుడు జరిగిన తొక్కిసలాటలో డ్రెయిన్‌లో పడిపోయి ఎనిమిది మంది చనిపోయారు. జనం ఎక్కువగా వచ్చినట్టు చూపించుకునేందుకు ప్రధాన కూడలిలో కాకుండా ఇరుకు రోడ్డులోకి తన వాహనాన్ని తీసుకెళ్లి అక్కడ డ్రోన్ విజువల్స్ తీస్తుండగా ఈ దారుణం జరిగింది. కేవలం చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు సైతం తేల్చారు.కానుకల పంపిణీ పేరుతో..గత ఏడాది జనవరి 1న గుంటూరు జేకేసీ కాలేజీలో స్థానిక టీడీపీ నాయకుడు ఉయ్యూరు శ్రీనివాస్ నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంతో ముగ్గురు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. చంద్రబాబు చేతుల మీదుగా కానుకలు పంపిణీ చేస్తారని విపరీతంగా ప్రచారం చేసి భారీగా జనాన్ని తీసుకువచ్చారు. కానీ చంద్రబాబు పది మందికి కానుకలు ఇచ్చి వెళ్లిపోగా, ఆ తర్వాత వాటి కోసం జనం ఎగబడడంతో తోపులాట జరిగి ముగ్గురు చనిపోయారు. కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా జనాన్ని రప్పించి వారి ప్రణాలు పోవడానికి కారకుడిగా మిగిలారు. -
దేశంలో జరిగిన తొక్కిసలాటలు.. మిగిల్చిన విషాదాలు
ఆంధప్రదేశ్‌లోని తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తుల అపరిమితమైన తపన తీవ్ర విషాదానికి దారితీసింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. దేశంలో ఇటువంటి ఘటనలు గతంలోనూ చోటుచేసుకుని, తీవ్ర విషాదాన్ని మిగాల్చాయి.మంధర్‌దేవి ఆలయం2005, జనవరి 25న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మంధర్‌దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 350 మందికి పైగా భక్తులు మృతిచెందారు. వందలాది మంది గాయపడ్డారు. కొబ్బరికాయలు పగులగొడుతుండగా, కొంతమంది మెట్లపై నుంచి పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది.కుంభమేళా2003 ఆగస్టు 27న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగిన కుంభమేళాలో పవిత్ర స్నానాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతిచెందారు. 140 మంది గాయపడ్డారు.చాముండా దేవి ఆలయంరాజస్థాన్లోని చాముండా దేవి ఆలయంలో 2008 సెప్టెంబర్ 30న జరిగిన తొక్కిసలాటలో 250 మంది మృతి చెందారు. బాంబు ఉందంటూ వదంతులు తలెత్తిన నేపధ్యంలో తొక్కిసలాటలో జరిగింది. ఈ ప్రమాదంలో 300 మందికి పైగా జనం గాయపడ్డారు.నైనా దేవి ఆలయంహిమాచల్ ప్రదేశ్‌లోని నైనా దేవి ఆలయంలో 2008లో జరిగిన మతపరమైన వేడుకలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో162 మంది ప్రాణాలు కోల్పోయారు.రతన్‌గఢ్ ఆలయం2013 అక్టోబర్ 13న మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లాలోని రతన్‌గఢ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 115 మంది మరణించారు. 100 మందికి పైగా జనం గాయపడ్డారు. యాత్రికులు దాటుతున్న నది వంతెన కూలిపోబోతున్నదనే వదంతితో తొక్కిసలాట జరిగింది.ఇండోర్2023, మార్చి 31 న ఇండోర్‌లోని ఒక ఆలయంలో పూజలు జరుగుతుండగా ఆలయం స్లాబ్ కూలిపోవడంతో 36 మంది మృతిచెందారు.శబరిమల2011, జనవరి 14న కేరళలోని శబరిమల పరిధిలోని పుల్లమేడు వద్ద యాత్రికులను జీపు ప్రమాదానికి గురైంది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 104 మంది భక్తులు మరణించారు. 40 మందికి పైగా జనం గాయపడ్డారు.గాంధీ మైదానంబీహార్లోని పాట్నాలో గల గాంధీ మైదానంలో 2014 అక్టోబర్ 3న దసరా వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో 32 మంది మృతి చెందారు. 26 మంది గాయపడ్డారు.పట్నా2012 నవంబర్ 19న పట్నాలోని గంగా నది ఒడ్డున ఉన్న అదాలత్ ఘాట్ వద్ద ఛఠ్ పూజ సందర్భంగా ఒక తాత్కాలిక వంతెన కూలిపోయింది. ఫలితంగా జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు.వైష్ణోదేవి ఆలయం2022, జనవరి 1న, జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందారు.రాజమండ్రి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో 2015, జూలై 14న పుష్కరాల ప్రారంభం రోజున గోదావరి నది ఒడ్డున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 27 మంది మృతిచెందారు. 20 మంది గాయపడ్డారు.హరిద్వార్ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్‌లో 2011 నవంబర్ 8న గంగానది ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతిచెందారు.రామ్ జానకి ఆలయం2010 మార్చి 4న ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని రామ్ జానకి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో దాదాపు 63 మంది మృతి చెందారు.హత్రాస్2024లో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట 121 మంది మృతిచెందారు. 300కుపైగా జనం గాయపడ్డారు. జూలై 2న సూరజ్‌పాల్ అలియాస్ భోలే బాబా అలియాస్ నారాయణ్ సకర్ హరి సత్సంగ్‌లో ఈ తొక్కిసలాట జరిగింది.రాజ్‌కోట్2024, మే 23న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్లో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 35 మంది మృతి చెందారు.గుంపులో చిక్కుకున్నప్పుడు..ఎప్పుడైనా మనం రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లి, గుంపులో చిక్కుకుపోయినప్పడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. సురక్షితంగా బయటపడేందుకు ప్రయత్నించాలి. కింద తెలిపిన పది ఉపాయాలు మనం గుంపునుంచి సురక్షితంగా బయటపడేందుకు సాయపడతాయి.1. మీరు ఎప్పుడైన రద్దీగా ఉండే ప్రదేశానికి వెళితే ప్రవేశం, నిష్క్రమణ మార్గాలను గుర్తుంచుకోవాలి.2. మీరు వెళ్లిన ప్రదేశం గురించిన పూర్తి సమాచారం మీ వద్ద ఉండాలి. మీరు జనసమూహంలో చిక్కుకుపోయినప్పుడు, ఆ ప్రాంతం మీకు పూర్తిగా తెలిస్తే అప్పడు మీరు సులభంగా బయటపడగలుగుతారు.3. రద్దీగా ఉండే ప్రదేశానికి వెళ్ళే ముందు, ఏదైనా అవాంఛనీయ సంఘటనను ఎదుర్కోవడానికి మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. నిష్క్రమణ ద్వారం సమీపంలో ఉండటం ఉత్తమం.4. మీరు ఎప్పుడైనా జనసమూహంలో చిక్కుకున్నప్పుడు, వ్యతిరేక దిశలో ముందుకు వెళ్లకూడదు. ఇలా చేస్తే ఆపద మరింత పెద్దదవుతుంది.5. మీరు గుంపులో చిక్కుకుంటే వీలైనంత త్వరగా అక్కడి నుండి బయటపడటానికి ప్రయత్నించాలి. ఆందోళన చెందే బదులు, మనసును ప్రశాంతంగా ఉంచుకుని ముందుకు నడవాలి.6. జనసమూహంలో చిక్కుకున్నప్పుడు, ఆ జనసమూహం దిశగానే ముందుకు కదలాలి. అప్పుడు ఆపద నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా కొంచెం స్థలం కనిపించినా, దానిని సద్వినియోగం చేసుకోవాలి.7. జనసమూహంలో చిక్కుకున్నప్పుడు, మీరు మీ చేతులను బాక్సర్ మాదిరిగా మీ ఛాతీ ముందు ఉంచుకోవాలి. తద్వారా మీ ఛాతీ సురక్షితంగా ఉంటుంది.8. మీరు ఎప్పుడైనా జనసమూహంలో చిక్కుకుని కిందపడిపోతే త్వరగా లేవడానికి ప్రయత్నించండి.9. మీరు జనసమూహంలో పడిపోయి లేవలేకపోతే, వెంటనే ఒక పక్కకు తిరిగి పడుకోండి. అలాగే మీ రెండు కాళ్ళను మీ ఛాతీకి తగిలించి, మీ చేతులను మీ తలపై ఉంచుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుతారు.10 మీరు రద్దీగా ఉండే ప్రదేశంలో చిక్కుకుంటే గోడలకు దూరంగా ఉండండి. బారికేడింగ్‌కు కూడా దూరంగా ఉండాలి. వెంటనే బయటకు వెళ్లడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఇది కూడా చదవండి: ఆరేళ్ల బుడతడు.. వెయ్యి కిలోమీటర్లు పరిగెడుతూ అయోధ్యకు.. -
మోర్బీ టూ కుంభమేళ.. దేశ చరిత్రలో పెను విషాదాలు ఇవే..
గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చూ నదిపై కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో దాదాపు 140 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురి ఆచూకీ గల్లంతు కాగా.. సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఈ విషాద ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. అయితే, ఇలాంటి పెను విషాద సంఘటనలు గతంలోనూ జరిగాయి. తొక్కిసలాటలు, ప్రకృతి విపత్తుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మోర్బీ దుర్ఘటన వేళ అలాంటి కొన్ని సంఘటనలు ఓసారి చూద్దాం. 2022, జనవరి 1: జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. 2016, ఏప్రిల్ 10: కేరళలోని కొల్లాంకు సమీపంలోని ఆలయ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 110 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 280 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలయం ఆధ్వర్యంలో బాణసంచా ప్రదర్శన చేపట్టగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2016, మార్చి 31: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న వివేకానంద పైవంతెన కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మంది గాయపడ్డారు. నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్పై హత్య కేసు నమోదైంది. 2014, అక్టోబర్ 3: బిహార్ రాజధాని పాట్నాలో దసరా ఉత్సవాలు విషాదాన్ని మిగిల్చాయి. గాంధీ మైదాన్‌లో నిర్వహించిన రావణ దహణం కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. మొత్తం 32 మంది ప్రాణాలు విడిచారు. 2013, అక్టోబర్ 13: మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లా రతన్‌గఢ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 115 మంది దుర్మరణం చెందారు. మరో 100 మంది వరకు గాయపడ్డారు. నదిపై ఉన్న వంతెన కూలిపోయే ప్రమాదం ఉందనే వార్త వ్యాప్తి చెందడంతో అది తొక్కిసలాటకు దారితీసింది. 2013, ఫిబ్రవరి 10: కుంభమేళ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఇందులో 36 మంది మరణించారు. 2012, నవంబర్ 19: బిహార్ రాజధాని పాట్నాలో గంగానదిలోని అదాలత్ ఘాట్ వద్ద చట్ పూజ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఇందులో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 2011, జనవరి 14: కేరళలోని శబరిమల ఆలయంలో తొక్కిసలాట జరిగి 106 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. 2010, మార్చి 4: ఉత్తర్‌ప్రదేశ్, ప్రతాప్‌గఢ్ జిల్లాలోని రామ్ జానకి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఓ బాబా ఉచితంగా దుస్తులు పంపిణీ చేస్తున్నారని తెలిసి భారీగా జనం తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగి 63 మంది మరణించారు. 2008, సెప్టెంబర్ 30: రాజస్థాన్, జోధ్‌పుర్ నగరంలోని చాముంఢాదేవి ఆలయంలో బాంబు కలకలం సృష్టించింది. దీంతో తొక్కిసలాట జరిగి 250 మంది మరణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు. 2008, ఆగస్టు 3: హిమాచల్ ప్రదేశ్ బిలాస్‌పుర్ జిల్లాలోని నైనా దేవి ఆలయం వద్ద కొండచరియలు విరిగిపడుతున్నాయనే వార్త కలకలం సృష్టించింది. దీంతో భక్తులు పరుగులు పెట్టారు. తొక్కిసలాట జరిగి 162 మంది మృతి చెందారు. 47 మంది గాయపడ్డారు. 2005, జనవరి 25: మహారాష్ట్ర, సతారా జిల్లాలోని మంధారదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 340 మంది భక్తులు మరణించారు. వందల మంది గాయపడ్డారు. 1997, జూన్ 13: దేశరాజ ధాని ఢిల్లీలోని ఉఫహార్ థియేటర్లో బాలీవుడ్ సినిమా ‘బార్డర్’ ప్రదర్శిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 59 మంది మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. 1997, ఫిబ్రవరి 23: ఒడిశా, బారిపడా జిల్లాలో ఓ వర్గానికి చెందిన నాయకుడి సమావేశంలో మంటలు చెలరేగి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో 206 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. 1954, ఫిబ్రవరి 3: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన మహా కుంభమేళలో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో మొత్తం 800 మందికిపైగా మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. భారత స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి కుంభమేళగా భావించటం వల్ల భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలిన పలు బ్రిడ్జిలు (ఫొటోలు) ఇదీ చదవండి: మోర్బీ కేబుల్ బ్రిడ్జి విషాదం.. కిందిస్థాయి ఉద్యోగుల అరెస్టు.. పత్తా లేకుండా పోయిన పైఅధికారులు -
Indonesia: మైదానంలో విషాద క్రీడ
మలాంగ్(ఇండోనేషియా): ప్రపంచ క్రీడా చరిత్రలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. సాకర్ స్టేడియంలో తొక్కిసలాట జరిగి ఇద్దరు పోలీసులు సహా 125 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఓడిపోయిన జట్టు మద్దతుదారులు క్రీడా స్ఫూర్తిని మర్చిపోయి ఆగ్రహావేశాలతో ఘర్షణకు దిగడం రణరంగానికి దారితీసింది. ఇండోనేషియాలో తూర్పు జావా ప్రావిన్స్‌లోని మలాంగ్ సిటీలో కంజురుహాన్ స్టేడియంలో శనివారం ఈ దారుణం జరిగింది. ఇప్పటిదాకా 125 మంది మృత్యువాత పడ్డారు. తొక్కిసలాటలో మరో 100 మందికిపైగా ప్రేక్షకులు గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 11 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. భాష్పవాయువు ప్రయోగంతో అలజడి కంజురుహాన్ స్టేడియంలో తూర్పు జావాకు చెందిన అరెమా ఎఫ్ఎస్ జట్టు, సురబయాకు చెందిన పెర్సిబయా జట్టుకు మధ్య శనివారం సాయంత్రం ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. 32,000 మంది ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. వీరంతా అతిథ్య జట్టు అరెమా ఎఫ్ఎస్ మద్దతుదారులే. పెర్సిబయా జట్టు చేతిలో అరెమా జట్టు 3–2 తేడాలో ఓటమి పాలయ్యింది. ఈ పరాజయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. క్రీడాకారులపై, సాకర్ అధికారులపై నీళ్ల సీసాలు, చేతిలో ఉన్న వస్తువులు విసిరారు. దాదాపు 3,000 మంది బారికేడ్లు దాటుకొని ప్రధాన మైదానంలోకి ప్రవేశించారు. అరెమా జట్టు మేనేజ్మెంట్తో ఘర్షణకు దిగారు. సొంత గడ్డపై 23 ఏళ్లుగా విజయాలు సాధిస్తున్న అరెమా టీమ్ ఇప్పుడెందుకు ఓడిపోయిందో చెప్పాలంటూ నిలదీశారు. అరుపులు కేకలతో హోరెత్తించారు. మరికొందరు స్టేడియం బయటకువెళ్లి, అక్కడున్న పోలీసు వాహనాలను ధ్వంసం చేసి, నిప్పుపెట్టారు. పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో అల్లరి మూకను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. భాష్పవాయువు గోళాలు స్టేడియంలోకి సైతం దూసుకెళ్లాయి. స్టాండ్స్‌లో కూర్చున్న అభిమానులు భయాందోళనకు గురయ్యారు. బాష్పవాయువును తప్పించుకోవడానికి అందరూ ఒక్కసారిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట మొదలయ్యింది. ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఊపిరాడని పరిస్థితి. స్టేడియంలోనే 34 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఆసుపత్రులకు తరలిస్తుండగా కొందరు, చికిత్స పొందుతూ మరికొందరు మృతిచెందారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారని అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఘటనతో ఇండోనేషియా సాకర్ అసోసియేషన్ ప్రీమియర్ సాకర్ లీగ్ లిగా–1ను నిరవధికంగా వాయిదా వేశారు. ఇదే చివరి విషాదం కావాలి: జోకో విడోడో ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట జరగడం, 125 మంది మరణించడం పట్ల ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం టీవీలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఇదే చివరి క్రీడా విషాదం కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాటి దారుణాలు జరగకూడదని కోరుకుంటున్నట్లు వివరించారు. ప్రజలంతా క్రీడాస్ఫూర్తిని పాటించాలని, మానవత్వం, సోదరభావాన్ని కలిగి ఉండాలని కోరారు. మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కీడ్రలు, యువజన శాఖ మంత్రికి, సంబంధిత అధికారులకు జోకో విడోడో ఆదేశాలు జారీ చేశారు. ఇండోనేషియా సాకర్ ప్రతిష్టకు మచ్చ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సాకర్ మ్యాచ్‌లకు తాము సన్నద్ధం అవుతున్న తరుణంలో స్టేడియంలో అభిమానులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఇండోనేషియా క్రీడలు, యువజన శాఖ మంత్రి జైనుదిన్ అమాలీ చెప్పారు. ఈ ఘటన తమ దేశ సాకర్ క్రీడా ప్రతిష్టను మసకబార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది మే 20 నుంచి జూన్ 11 వరకు జరిగే ఫీఫా యూ–20 ప్రపంచ కప్‌నకు ఇండోనేషియా అతిథ్యం ఇవ్వబోతోంది. ఇందుకోసం ఏర్పాట్లు సైతం ప్రారంభించింది. నిజానికి ప్రపంచ సాకర్ క్రీడా సమాఖ్య ‘ఫిఫా’ నిబంధనల ప్రకారం స్టేడియంలో బాష్పవాయువు ప్రయోగించకూడదు. దేశీయంగా జరిగే క్రీడలపై ఫిఫా నియంత్రణ లేకపోవడం కొన్నిసార్లు పరిస్థితి అదుపు తప్పుతోంది. ఆట చూసేందుకు వచ్చి అనంత లోకాలకు.. ప్రపంచ క్రీడాలో చరిత్రలో ఇప్పటిదాకా ఎన్నో విషాదాలు చోటుచేసుకున్నాయి. మైదానాలు రక్తసిక్తమయ్యాయి. ఆట చూసి ఆనందించేందుకు వచ్చిన అభిమానులు విగతజీవులయ్యారు. ఎంతోమంది క్షతగాత్రులుగా మారారు. విషాదాలు కొన్ని.. 1979 డిసెంబర్ 3: అమెరికాలోని సిన్సినాటీలో రివర్‌ఫ్రంట్ మైదానంలో తొక్కిసలాట జరిగింది. 11 మంది మృతి చెందారు. 1980 జనవరి 20: కొలంబియాలోని సిన్సిలెజె పట్టణంలో బుల్‌ఫైట్ కోసం తాత్కాలికంగా కర్రలతో నిర్మించిన నాలుగు అంతస్తుల స్టేడియం కూలిపోయింది. ఈ ఘటనలో 200 మంది బలయ్యారు. 1988 మార్చి 13: నేపాల్‌లోని ఖాట్మాండు స్టేడియంలో సాకర్ మ్యాచ్ జరుగుతుండగా అకస్మాత్తుగా వడగళ్ల వాన మొదలయ్యింది. స్టేడియంలో తొక్కిసలాట జరిగి 93 మంది చనిపోయారు. 1989 ఏప్రిల్ 15: ఇంగ్లాండ్‌లోని షెఫీల్డ్‌లో హిల్స్‌బరో స్టేడియంలో అభిమానుల నడుమ ఘర్షణ జరిగింది. 97 మంది మరణించారు. 1996 అక్టోబర్ 16: గ్వాటెమాలాలోని గ్వాటెమాలా సిటీలో సాకర్ ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో గ్వాటెమాలా, కోస్టారికా అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 84 మంది విగత జీవులుగా మారారు. 2001 మే 9: ఘనా రాజధాని అక్రాలో స్టేడియంలో ఘర్షణ, అనంతరం తొక్కిసలాట. 120 మందికిపైగా ప్రేక్షకులు బలయ్యారు. -
తొక్కిసలాటలకు చెక్
కొన్ని ఉత్సవాలకు జనం లక్షల్లో వస్తుంటారు. ముందుకు అడుగేయలేనంత దట్టంగా గుమిగూడుతుంటారు. అలాంటి సందర్భాల్లో ఏమైనా తొక్కిసలాటలు జరగవచ్చు. ఊహించని విషాదాలు చోటు చేసుకోవచ్చు. మరి వాటిని నివారించడమెలా? దీనికి సైన్స్ ఏమైనా పరిష్కారం చూపుతుందా? అంటే అవుననే అంటున్నారు ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు. ఇందుకు సాయపడే అల్గారిథమ్‌ను వారు తయారు చేశారు. గుంపులో తలెత్తిన అల్లర్లు, తొక్కిసలాట వంటివి నివారించే దిశగా పోలీసులకు ఎక్కడ మోహరించాలనే∙విషయాన్ని ఈ పద్దతి ద్వారా గ్రహించవచ్చని, తద్వారా గందరగోళాన్ని ఆదిలోనే నివారించవచ్చని వారు చెబుతున్నారు. ఫిజికల్ రివ్యూ లెటర్స్ జర్నల్‌లో ప్రచురితమైన సంబంధిత పరిశోధనాంశం ప్రకారం – కంప్యూటర్ సిమిలేషన్ను ఉపయోగించి సురక్షిత తరలింపు విధానాలు రూపకల్పన చేసుకునేందుకు సైతం ఇది దోహదపడుతుంది. కుంభమేళాకి కోట్లాది మంది జనం తరలివస్తుంటారు. ఒక్కోరోజు రెండు కోట్ల మంది వరకు పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారు. ఇలాంటి చోట ఏవైనా దుర్ఘటనలు సంభవిస్తే నష్టం భారీగానే వుంటుంది. ఇలాంటి దుర్ఘటనలను అడ్డుకునే లక్ష్యంతో, అతి జనసమ్మర్థాన్ని మెరుగైన పద్ధతుల్లో నియంత్రించే ఉద్దేశంతో తాము ఈ అల్గారిథమ్‌ను రూపొందించామంటున్నారు ఈ శాస్త్రవేత్తలు. అసలు ఇలాంటి తొక్కిసలాటలు ఎలా మొదలవుతాయో గమనించగలిగితే వాటిని నివారించగల మార్గాలను కూడా మనం గుర్తించవచ్చునని చెబుతున్నారు మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్ మహేశ్ పంచాగ్నుల. తొక్కిసలాటల తాలూకూ తొలి సంకేతాలను అర్థం చేసుకుని, ఎక్కడ పోలీసు బలగాలు వుంచాలనేది గ్రహించడం చాలా ముఖ్యమంటున్నారు ఈయన. జనసమూహాలను క్రమబద్ధీకరించేందుకు కొన్ని చోట్ల ముందుగానే బారికేడ్లు ఏర్పాటు చేయడం మెరుగైన ఫలితాలు ఇవ్వగలదంటున్న ఈ శాస్త్రవేత్తలు.. బయటకు వేగంగా పోవడానికి వీల్లేని ప్రదేశాల్లో జనం దట్టంగా కూడినపుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోగలవో విశ్లేషించారు. ద్రవ పదార్థాలు ప్రవహించే తీరును విశ్లేషించే ఫ్లూయిడ్ డైనమిక్స్‌ను ఆపాదిస్తూ జనసమూహం పద్ధతి ప్రకారం ముందుకు సాగేలా చూడాలని బృందంలో భాగంగా వున్న సుమేష్ పి తంపి, అజింక్యా కులకర్ణి చెబుతున్నారు. -
రైల్వేస్టేషన్లో తొక్కిసలాట; ఇద్దరి మృతి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని హౌరాలో ఉన్న సంత్రాగాఛీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. స్టేషన్‌లోని వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లపైకి మూడు రైళ్లు ఒకేసారి వస్తున్నాయని ఆనౌన్స్మెంట్ వినిపించింది. వెంటనే తమ రైలు మిస్సవ్వకూడదనే తొందరలో ప్రయాణికులంతా రెండో, మూడో ప్లాట్‌ఫామ్‌లను కలిపే ఫుట్ఓవర్ బ్రిడ్జిపైకి చేరారు. దాంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి ఇద్దరు ప్రయాణికులు చనిపోయారని, 15 మంది గాయపడ్డారని వాయవ్య రైల్వే అధికార ప్రతినిధి సంజయ్ ఘోష్ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.1 లక్ష చొప్పున పరిహారం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ప్రకటించాయి. -
గేట్లు విరిచి.. క్యూలైన్లోకి దూసుకెళ్లారు..
-
గేట్లు విరిచి.. క్యూలైన్లోకి దూసుకెళ్లారు..
తిరుమల : ఏకాదశి దర్శనం కోసం తిరుమలలో భక్తులు ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. టీటీడీ సామాన్య భక్తులను పట్టించుకోకుండా వీఐపీలకు పెద్దపీట వేస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు గురువారం ఉదయం లేపాక్షి సర్కిల్ వద్ద వీఐపీలను అడ్డుకుని నిరసన తెలిపారు. మరోవైపు వెంకన్నను ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులతో కొండ కిక్కిరిసిపోయింది. గత రాత్రి 8 గంటలకే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని లైన్లు నిండిపోయాయి. టీటీడీ అధికారులు ముందు జాగ్రత్తగా క్యూల్లోకి భక్తులను అనుమతించలేదు. దీంతో సహనం కోల్పోయిన భక్తులు శంకుమిట్ట కాటేజ్ వద్ద క్యూ గేట్లను విరిచారు. మరికొందరు రాళ్లతో తాళాలను పగుల గొట్టి, క్యూలోకి దూసుకెళ్లారు. క్యూ కట్టిన ఇనుప కంచె కూడా విరిగి కిందపడ్డాయి.క్యూలోకి దూసుకెళ్లారు. పోలీసు, భద్రతా సిబ్బంది అడ్డుచెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదు.