
ఇద్దరు తీవ్రవాదుల హతం
జమ్ము కాశ్మీర్: జమ్ముకాశ్మీర్ సరిహద్దులో తీవ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఆదివారం హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ సంఘటన పుల్వామా జిల్లాలోని ట్రల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో జైష్ ఈ మహ్మద్కు చెందిన ఇద్దరు తీవ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.