శ్రీనగర్: మారకద్రవ్యాలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఒక ప్రైవేట్ వాహనంలో శనివారం మత్తుమందును అమ్ముతుండగా వారు పోలీసులకు కంటబడ్డారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ వాహనాన్ని అడ్డగించి ముగ్గురి వ్యక్తులను అరెస్ట్ చేశారు.
అంతేకాకుండా ఆ వాహనాన్ని తనిఖీ చేయగా ఒక కేజీ వరకూ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వారు.. ఆదిల్ వానీ, మెహమ్మద్ దిల్వార్, ఉబయిద్ భట్గా గుర్తించారు. నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
కశ్మీర్లో గంజాయి విక్రయం: ముగ్గురి అరెస్ట్
Published Sat, Apr 30 2016 6:46 PM | Last Updated on Fri, May 25 2018 2:37 PM
Advertisement
Advertisement