శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లో కొండ చరియలు విరిగిపడటంతో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. శుక్రవారం మచిల్ సెక్టార్, ఉత్తర కశ్మీర్, కుప్వార జిల్లాలోని ఆర్మీక్యాంప్‌పై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు గాయపడ్డారు.
బుధవారం అఫ్ఘనిస్తాన్- తజకిస్తాన్ సరిహద్దుల్లో భూమి కంపించడంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తర కశ్మీర్‌లోని పలు జిల్లాలకు గువారమే ముందస్తు హెచ్చరిక జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment