హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదిలో మరణించిన హైదరాబాద్కు చెందిన నలుగురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. కులుమనాలిలో శవపరీక్షలు నిర్వహించారు. సోమవారం సాయంత్రం ప్రత్యేక సైనిక విమానంలో హైదరాబాద్కు తరలిస్తున్నారు. రాత్రి 10 గంటలకు హైదరాబాద్ హకీంపేట ఎయిర్ పోర్టుకు మృతదేహాలు చేరుకునే అవకాశముంది. వీరిని ఆకుల విజేత, గంపల ఐశ్వర్య, రాంబాబు, లక్ష్మిలుగా గుర్తించారు.
ఆదివారం సాయంత్రం విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలు విద్యార్థులు 24 మంది నదిలో గల్లంతయిన విషయం తెలిసిందే. ఇతర విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
హిమాచల్ ఘటన.. 4 మృతదేహాలు హైదరాబాద్కు తరలింపు
Published Mon, Jun 9 2014 6:37 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement