ఘోర రోడ్డు ప్రమాదం; 12 మంది మృతి | 4 School Children among 12 killed in a road accident at Madhya Pradesh’s Rajgarh district | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం; 12 మంది మృతి

Published Tue, Dec 13 2016 8:04 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

ఘోర రోడ్డు ప్రమాదం; 12 మంది మృతి - Sakshi

ఘోర రోడ్డు ప్రమాదం; 12 మంది మృతి

రాజ్‌ గఢ్‌: మధ్యప్రదేశ్‌ లోని రాజ్‌ గఢ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులతో పాటు 12 మంది దుర్మరణం పాలయ్యారు. ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆటోలోని వారందరూ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన బస్సు సాయికృప ట్రావెల్స్‌ కు చెందినదిగా గుర్తించారు.

ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 25 వేల చొప్పున సహాయం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement