ఖైదీల ప్రవర్తనలో మార్పు, సిబ్బంది సంక్షేమంపై చర్చ
విశాఖపట్నం నాలుగు రాష్ట్రాలకు చెందిన ై జెళ్ల శాఖ డీజీలు సోమవారం ఇక్కడి రుషికొండలోని ఏపీ టూరిజం హోటల్ (హరితా రిసార్ట్స్)లో సమావేశమయ్యారు. అకాడెమీ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షన్ అడ్మినిస్ట్రేషన్ (ఆప్‌కా) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జైళ్ల శాఖ డీజీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతి ఏడాది ఈ రాష్ట్రాల్లో జైళ్ల శాఖకు సంబంధించిన విషయాలపై చర్చించడానికి ఏదో ఒక ప్రాంతంలో సమావేశమవుతుంటారు. ఈ ఏడాది విశాఖలోని సాగర తీరంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా తమిళనాడు రాష్ట్రం రాయవెల్లూరులో ఉన్న జైళ్ల శాఖ సిబ్బంది శిక్షణ కేంద్రం గురించి చర్చించారు.
జెళ్ల శాఖలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి, సిబ్బంది శిక్షణలో కొత్త పద్ధతులు, ఖైదీల ప్రవర్తనలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి తదితర అంశాలపై చర్చించారు. సిబ్బంది సంక్షేమం, జీతభత్యాలు, పదోన్నతులపై చర్చించారు. ఈ సమావేశంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డీజీలు ఎస్.జార్జి, టి.పి సన్‌కుమార్, కె.వి గగన్‌దీప్, టి.కృష్ణంరాజుతో పాటు న్యూడిల్లీ జైళ్ల శాఖ డెరైక్టర్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్ సింగ్, రాయవెల్లూరు శిక్షణ కేంద్రం డెరైక్టర్ డాక్టర్ ఎం.ఆర్.అహ్మద్, ఏపీ కోస్తాంధ్రా డీఐజీ ఎ.నర్సింహ, విశాఖ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ఇండ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
విశాఖలో 4 రాష్ట్రాల జైళ్ల డీజీల భేటీ
Published Tue, Apr 22 2014 3:40 AM | Last Updated on Sat, Aug 18 2018 8:53 PM
Advertisement
Advertisement