
శ్రీనగర్ : గత మూడు వారాలుగా కరోనా కేసులు అధికమవుతున్నందున అధికారులు కశ్మీర్ లోయలోసంపూర్ణ లాక్‌డౌన్ విధించారు. బందిపోరా జిల్లా మినహా మొత్తం కశ్మీర్ లోయర్ నేటి (బుధవారం ) నుంచి ఆరో రోజులపాటు లాక్‌డౌన్ ఉండనున్నట్లు ప్రకటించారు. అత్యవసర సేవలకు లాక్‌డౌన్ మినహాయింపు ఉంటుందని తెలిపారు. వ్యవసాయం, నిర్మాణ కార్యాకలాపాలు యధావిదిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. (బెంగళూరుకు స్వేచ్ఛ )
ఆరు రోజుల తర్వాత (జూలై 27) అనంతరం పరిస్థితిని సమీక్షించి తదనంతరం నిర్ణయం తీసుకుంటామని ఓ సీనియర్ అధికారి జాతీయ మీడియాకు వివరించారు. అప్పటికీ కరోనా కేసులు నియంత్రణలో లేకపోతే లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత కొన్ని రోజులుగా కశ్మీర్ లోయలో కరోనా కేసులు, మరణాలు అధికమవుతున్నాయి. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో కరోనా కారణంగా 263 మంది మరణించారు. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. జమ్మూకశ్మీర్‌లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 15,258కు చేరువైంది. (కరోనా: బస్సులు శానిటైజ్ చేయడం లేదు )
Comments
Please login to add a commentAdd a comment