మోతిహార: బిహార్‌కు చెందిన 60మంది దళిత విద్యార్ధులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు సిద్దమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించకుంటే తాము చనిపోవడం ఖాయమని హెచ్చరించారు. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో రాజధాని ఇంజనీరింగ్ కళాశాల(ఆర్‌ఈసీ)లో బీహార్కు చెందిన విద్యార్థులు చదువుతున్నారు.
అయితే, వారికి బిహార్ ప్రభుత్వం నుంచి స్టైపండ్ రూపంలో అందాల్సిన నిధులు అందకపోవడంతో జనవరి 8 న కళాశాల యాజమాన్యం వారిని వసతిగృహం నుంచి బలవంతంగా ఖాళీ చేయించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ విద్యార్ధులు ఇక తమ చదువు ముందుకు సాగదని భావించి మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ఈ 60మంది దళిత విద్యార్ధుల్లో 18 మంది తూర్పు చంపారన్, 42 మంది పశ్చిమ చంపారన్‌కు చెందినవారు ఉన్నారు. ఇప్పటి వరకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు తిరిగి చెల్లించేట్లయితేనే కాలేజీకి రావాలని ఆదేశించారు.
ఆత్మహత్యకు దిగిన 60మంది దళిత విద్యార్థులు
Published Tue, Feb 2 2016 4:14 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement