శివరాత్రికొచ్చిన అమ్మాయిపై అఘాయిత్యం
హౌరా: శివరాత్రి ఉత్సవాలకు వచ్చి తప్పిపోయిన 15 ఏళ్ల అమ్మాయిపై అయిదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో ఈ దారుణం జరిగింది.
శ్యాంపూర్ కు సమీపంలో నిర్మానుష ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించిన పోలీసులు వైద్య పరీక్షలకోసం ఆసుపత్రికి తరలించారు. దుండగులు ఆమెను నిర్జన ప్రాంతంలోకి బలవంతంగా తీసుకుపోయి ఈ దురాగతానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని , మిగతా వారికి గాలిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.