బైక్‌పై వస్తుంటే ఉరితాడైన మాంజాదారం | a person accidentally killed by kite manza | Sakshi
Sakshi News home page

బైక్‌పై వస్తుంటే ఉరితాడైన మాంజాదారం

Published Wed, Mar 8 2017 6:56 PM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

బైక్‌పై వస్తుంటే ఉరితాడైన మాంజాదారం

బైక్‌పై వస్తుంటే ఉరితాడైన మాంజాదారం

అన్నానగర్‌: గాలిపటానికి కట్టే మాంజాదారం కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలుకోల్పోయాడు. బైక్‌పై వెళుతున్న అతడికి తగిలి కిందపడటంతో చనిపోయాడు. చెన్నైలోని తాంబరం మధురవాయల్‌ బైపాస్‌ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. చెన్నై కొళత్తూరుకి చెందిన శివప్రకాశ్‌ (40) నీలాంగరైలోని ప్రైవేటు సంస్థలో ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. శివప్రకాశ్‌ తన తండ్రితో కలసి అగరమ్‌ తెన్‌ గ్రామానికి బైక్‌పై వెళ్లి వస్తుండగా అనకాపుత్తూరు అడయారు బ్రిడ్జి వద్ద గాలిపటాల మంజా దారం తగిలి కింద పడ్డారు.

శివప్రకాశ్‌కు గొంతుకు మాంజాదారం చుట్టుకుపోయి ఊపిరిఆడకపోవడంతోపాటు తీవ్ర గాయాలు అవడంతో సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. తండ్రి చంద్రశేఖర్‌ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న శంకర్‌నగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని శివప్రకాశ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement