పది రోజుల్లో 15 మిలియన్ల విరాళాలు!
పది రోజుల్లో 15 మిలియన్ల విరాళాలు!
Published Tue, Mar 11 2014 9:31 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి భారీగా విరాళాలు లభించాయి. విదేశాల నుంచే కాకుండా స్వదేశంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి మంచి స్పందన లభించింది. మార్చి నెలలో 10 రోజుల వ్యవధిలో సుమారు కోటి 50 లక్షల రూపాయల విరాళాలు లభించాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం నుంచి 24, 26, 481 రూపాయలు లభించాయి. గుజరాత్ లో మోడీ అభివృద్ధిని పరిశీలించేందుకు వెళ్లిన అరవింద్ కేజ్రివాల్ ను మార్చి 5 తేదిన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ అసెంబ్లీలో ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇచ్చిన ఆప్.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపేందుకు పార్టీని బలోపేతం చేస్తోంది. మార్చి 1 తేది నుంచి 10తేది వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి 14,535,050 రూపాయల నిధులు లభించాయి. గుజరాత్ కాకుండా ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా నుంచి భారీగానే నిధులు అందాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ప్రతి రోజు 15 నుంచి 20 లక్షల రూపాయలు విరాళాలు అందుతున్నాయని, అమెరికా, సింగపూర్, యూఏఈ, బ్రిటన్ ఇతర దేశాల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయని పార్టీ నేతలు తెలిపారు.
Advertisement
Advertisement