సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సహా 15 నుంచి 20 రాష్ట్రాల్లో పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్ణయించింది. అభ్యర్ధుల తొలి జాబితాను ఈ నెల 15 నుంచి 20లోగా విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. ‘మై భీ ఆమ్ ఆద్మీ’ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా చేపట్టాలని, ఆ కార్యక్రమం ద్వారా సభ్యత్వ నమోదు కూడా చేపట్టాలని ఆదివారం ఇక్కడ ముగిసిన పార్టీ రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయించింది. ఈ వివరాలను ఆప్ అధికార ప్రతినిధి యోగేంద్ర యాదవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ నెల 10 నుంచి 26 వరకు ‘మై భీ ఆమ్ ఆద్మీ’ పేరి ట ప్రచార, సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. ఎన్నికల సమన్వయానికి జాతీయస్థాయిలో ముగ్గురు సభ్యుల (యోగేంద్ర యాదవ్, సంజయ్ సింగ్, పంకజ్ గుప్తా)తో సమన్వ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. హర్యానాలోని 10 లోక్‌సభ సీట్లతోపాటు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని యాదవ్ చెప్పారు.
20కల్లా ‘ఆప్’ అభ్యర్థుల జాబితా
Published Mon, Jan 6 2014 3:14 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement