
కటకటాల్లోకి మరో ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: మరో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కటకటాలపాలయ్యాడు. గతంలో అతడి వల్ల చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించిన కేసులు పోలీసులు ఆయనను గురువారం అరెస్టు చేసి కోర్టు తరలించారు. అనంతరం కోర్టు అతడికి జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
ఈయన అరెస్టుతో ఇప్పటి వరకు వివిధ కేసుల్లో అరెస్టు అయిన ఆప్ ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరింది. ఆప్ ఎమ్మెల్యే అఖిలేశ్ త్రిపాఠి 2013లో ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లకు కారణమయ్యారని ఆరోపణలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఈయనపై ఇప్పటి వరకు మొత్తం 21 కేసులు నమోదయ్యాయి.