2 లక్షల టాయిలెట్లు కట్టిస్తాం: ఆప్ | AAP promises 2 lakh toilets for women | Sakshi
Sakshi News home page

2 లక్షల టాయిలెట్లు కట్టిస్తాం: ఆప్

Published Wed, Nov 26 2014 8:14 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

2 లక్షల టాయిలెట్లు కట్టిస్తాం: ఆప్ - Sakshi

2 లక్షల టాయిలెట్లు కట్టిస్తాం: ఆప్

మహిళల కోసం దేశ రాజధానిలో రెండు లక్షల పబ్లిక్ టాయిలెట్లు కట్టిస్తామని, రేప్ కేసుల విచారణకు వంద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. వాటితో పాటు.. నగరమంతా వై-ఫైతో కనెక్ట్ అయి ఉండే సీసీటీవీ కెమెరాలను కూడా పెట్టిస్తామంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ హామీలు ప్రకటించింది. 'ఢిల్లీ డైలాగ్' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఈ విషయాలు తెలిపింది.

రాజధాని నగరం నడిబొడ్డునున్న తల్కతోరా గార్డెన్స్లో 500 మంది మహిళలతో నిర్వహించిన సదస్సులో ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఈ హామీలను గుప్పించారు. తమ ప్రాంతాలకు దగ్గర్లో ఏవైనా మద్యం దుకాణాలుంటే, వాటిని మూసేయాల్సిందిగా తీర్మానాలు చేయొచ్చని ఆయన మహిళలకు చెప్పారు. ప్రతి డీటీసీ బస్సులో ఈవ్ టీజింగ్ను అరికట్టడానికి ఓ మార్షల్ను పెడతామని కూడా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement