బీజేపీయే కారణం: కేజ్రీవాల్ | BJP is riding on politics of hatred, alleges Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

బీజేపీయే కారణం: కేజ్రీవాల్

Published Tue, Nov 4 2014 5:01 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

బీజేపీయే కారణం: కేజ్రీవాల్ - Sakshi

బీజేపీయే కారణం: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఆలస్యానికి కారణం బీజేపీయే కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.  రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని అన్నారు. ఢిల్లీలో రాబోయేది తమ ప్రభుత్వమేనని దీమా వ్యక్తం చేశారు. ప్రత్యక్ష పోరుకు బీజేపీ భయపడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం అభ్యర్థిని బీజేపీ ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.

ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు మంగళవారం కేంద్ర కేబినెట్ సిఫారసు చేయడంతో త్వరలో శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నారు. జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, ఆప్, కాంగ్రెస్ ముందుకు రాకపోవడంతో లెప్ట్నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫార్సు చేశారు.  దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement