ఎన్నికలంటే బీజేపీకి భయం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ నిప్పులు చెరిగారు. బీజేపీకి కొంచెమైనా సిగ్గు ఉంటే ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. బీజేపీ తీరు వల్ల ఢిల్లీ ప్రజలు సమస్యల్లో కూరుకుపోయారన్నారు.
ఢిల్లీలో నీటి, విద్యుత్ సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నాయన్నారు. అందుకే ఢిల్లీలో ఎన్నికలకు వెళ్లడానికి బీజేపీ భయపడుతోందని ఆయన అన్నారు. బీజేపీకి అణువంతైన విశ్వాసం ఉండి ఉంటే గత ఐదు నెలల్లో ఎన్నికలు నిర్వహించి ఉండదేని కేజ్రీవాల్ అన్నారు. అతిపెద్ద పార్టీ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో రాజకీయపార్టీల మధ్య మాటల యుద్ధం ఊపందుకుంది.