న్యూఢిల్లీ: హెలికాప్టర్ల స్కాం కేసులో భారత్‌కు ఎదురుదెబ్బ తలిగింది. అగస్టావెస్ట్‌ల్యాండ్ కంపెనీకి చెందిన రూ.2,360 కోట్ల బ్యాంకు గ్యారంటీలను జరిమానాల కింద భారత్ స్వాధీనం చే సుకోకుండా ఇటలీలోని మిలాన్ కోర్టు మంగళవారం నిషేధం విధించింది.
హెలికాప్టర్ల ఒప్పందాన్ని ఉల్లంఘించారని భారత్ అస్పష్ట ఫిర్యాదు చేసిందని, ఇటాలియన్ బ్యాంకుల్లోని తమ గ్యారంటీలను స్వాధీనం చేసుకోకుండా ఆ దేశాన్ని అడ్డుకోవాలని తాము కోరగా కోర్టు మన్నించిందని అగస్టా తెలిపింది