మే 4 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం | Air India Opens Booking For Domestic Routes From May 4th | Sakshi
Sakshi News home page

మే 4 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం

Published Sat, Apr 18 2020 5:47 PM | Last Updated on Sat, Apr 18 2020 8:09 PM

Air India Opens Booking For Domestic Routes From May 4th  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో పూర్తిగా ఆగిపోయిన విమాన సర్వీసులను త్వరలోనే పునఃప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా సంస్థ పేర్కొంది. మే 4 వ తేదీ నుంచి దేశీయ విమానాల టికెట్‌ బుకింగ్‌ ప్రకియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అయితే మే 31 వరకు అంతర్జాతీయ విమానాల బుకింగ్‌కు అనుమంతించడం లేదని, జూన్‌ 1 నుంచి ఇంటర్నేషనల్‌ బుకింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కాగా కరోనా కట్టడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించగా, అత్యవసర సేవలకు మినహా అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలు సైతం రద్దు అయిన విషయం తెలిసిందే. (‘మీరెప్పుడైనా ప్రధానమంత్రి కావాలనుకున్నారా’ )

దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మే 3తో ముగుస్తున క్రమంలో ఎయిర్‌ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రతి అప్‌డేట్‌ను అందిస్తుంటామని ఎయిర్‌ ఇండియా తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా సంస్థ దేశవ్యాప్తంగా అలాగే చైనా వంటి అంతర్జాతీయ మార్గాలకు వైద్య సామగ్రి తరలింపు కోసం విమాన సర్వీసులను నడుపుతోంది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు అవసరమైన వైద్య సరుకును రవాణా చేయడానికి ‘లైఫ్‌లైన్‌ ఉడాన్’ విమానాలు నడుపుతున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నివేదించింది. ఇక ఈ రోజు (శనివారం) ఉదయం ఎయిర్ ఇండియా బి -787 విమానం ఢిల్లీ నుంచి వైద్య సామగ్రిని తీసుకొని చైనాకు వెళ్లినట్లు ఏఎన్‌ఐ తెలిపింది. (థాంక్యూ కెప్టెన్‌ యూ ఆర్‌ అవర్‌ హీరో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement