అసలు నిందితుడు అయ్యప్ప | aiyyappa, a delivery boy is main culprit, says bangalore commissioner | Sakshi
Sakshi News home page

అసలు నిందితుడు అయ్యప్ప

Published Thu, Jan 5 2017 5:39 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

అసలు నిందితుడు అయ్యప్ప - Sakshi

అసలు నిందితుడు అయ్యప్ప

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని నగర పోలీసు కమిషనర్ ప్రవీణ్ సూద్ తెలిపారు. ఈ దారుణానికి పాల్పడింది మొత్తం ఆరుగురు వ్యక్తులని, వాళ్లలో డెలివరీ బోయ్‌గా పనిచేస్తున్న అయ్యప్ప అనే వ్యక్తి ప్రధాన నిందితుడని చెప్పారు. అతడు ఐటీఐ చదువుతున్నట్లు తెలిపారు. 
 
గత కొన్ని రోజులుగా అతడు బాధితురాలి వెంట పడుతున్నాడని, కొత్త సంవత్సరం రోజున ఆమె ఒక పార్టీ నుంచి అర్ధరాత్రి తిరిగి వస్తుండగా వాళ్లంతా కలిసి ఆమెను వేధించారని అన్నారు. బాధితురాలికి, అయ్యప్పకు మధ్య స్నేహం కూడా ఏమీ లేదని, వాళ్లిద్దరి నివాసాలు మాత్రం దగ్గరలో ఉంటాయని చెప్పారు. స్వయంగా అతడే ఆమెను లైంగికంగా వేధించినట్లు ఆయన వివరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement