
మరోసారి క్యాబినెట్ విస్తరణ
లక్నో: సమాజ్ వాదీ పార్టీ లో అంతర్గత సంక్షోభం ముగియడంతో మరోసారి మంత్రి వర్గాన్ని సీఎం అఖిలేష్ యాదవ్ విస్తరించన్నారు. సోమవారం ముగ్గురు కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రెండువారాల క్రితం అవినీతి ఆరోపణలపై మైనింగ్ శాఖ మంత్రి గాయత్రి ప్రజాపతి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజ్ కిషోర్ ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. వీరికి కోర్టు క్లీన్ చీట్ ఇవ్వడంతో తిరిగి మంత్రి వర్గంలోకి తీసుకోనున్నారు.
జులైలో మంత్రివర్గ విస్తరణలో ప్రమాణ స్వీకారం చేయలేకపోయిన జియాజుద్దీన్ రిజ్వీ ఈ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.మరోవైపు అవినీతి ఆవినీతి ఆరోపణలపై పదవులు కోల్పోయిన వారి చేత తిరిగి ప్రమాణ స్వీకారం చేయించరాదని గవర్నర్ కు సామాజిక కార్యకర్త నూతన్ ఠాకూర్ ఫిర్యాదు చేశారు. యూపీ క్యాబినెట్ లో ప్రస్తుతం 60 మంత్రులున్నారు. మంత్రి మండలిని విస్తరించడం ఇది ఎనిమిదోసారి.