సాక్షి, న్యూఢిల్లీ : అన్‌లాక్ 2.0లో భాగంగా తాజ్‌మహల్, ఎర్రకోట సహా దేశవ్యాప్తంగా చారిత్రక కట్టడాలు జులై 6 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. కరోనా కట్టడితో విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్ అనంతరం పూర్తి భద్రతతో చారిత్రక, సాంస్కృతిక కట్టడాలు మళ్లీ ప్రారంభం కానున్నాయని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వెల్లడించారు.
కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు మార్చి చివరి వారం నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌కు భారీ సడలింపులు ప్రకటించినా ఇప్పటివరకూ తెరుచుకోని చారిత్రక కట్టడాల వద్ద జులై 6 నుంచి తిరిగి పర్యాటకుల సందడి మొదలవనుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)తో సంప్రదింపులు జరిపిన మీదట కేంద్ర ప్రభుత్వం చారిత్రక కట్టడాలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. చదవండి : తాజ్ అందాలు ఆస్వాదించా
Comments
Please login to add a commentAdd a comment