సాక్షి, న్యూఢిల్లీ : హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. రేపు(గురువారం) జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు విషయాలను వెల్లడించారు.
మొత్తం 7,525 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు.. 50లక్షల 25 వేల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నట్లు ఈసీ తెలిపింది. ఇప్పటిదాకా కోటి ముప్పై లక్షల రూపాయల నగదు.. 2.35 లీటర్ల మద్యం, పెద్ద ఎత్తున్న మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పుష్పిందర్ రాజ్‌పుత్ తెలిపారు. ఇంకా ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభకానుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగతుంది.
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 17,850 పోలీస్‌లు విధులు చేపట్టనున్నారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో వీవీప్యాట్ ఈవీఎంలను ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. మొత్తం 68 శాసనసభ స్థానాలకు గానూ 337 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment