
సాక్షి, న్యూఢిల్లీ: హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని మంత్రుల బృందం ‘శత్రు ఆస్తుల’ అమ్మకాన్ని పర్యవేక్షించనుంది. దేశవ్యాప్తంగా దాదాపు 9,400 శుత్ర ఆస్తులున్నాయి. వాటి అమ్మకం ద్వారా రూ.లక్ష కోట్లు వస్తాయని అంచనా. ఇందుకోసం మంత్రుల బృందంతో పాటు మరో రెండు ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. దేశ విభజన అనంతరం పాకిస్తాన్, చైనాలకు వెళ్లి, అక్కడి పౌరసత్వం పొందినవారు భారత్‌లో వదిలి వెళ్లిన స్థిరాస్తులనే శత్రు ఆస్తులుగా పరిగణిస్తారు. వీటి కోసం ప్రత్యేకంగా ‘ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్’ను సైతం రూపొందించారు. ఈ శత్రు ఆస్తుల్లో పాక్ వెళ్లిన వారివి 9,280 ఉండగా, చైనా వెళ్లినవారివి 126 ఉన్నాయి. పాకిస్తాన్ వెళ్లినవారి ఆస్తుల్లో 4,991 యూపీలో, 2,735 పశ్చిమ బెంగాల్‌లో, 487 ఢిల్లీలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment