న్యూఢిల్లీ: బిజినెస్మెన్ సినిమాలో సూర్య భాయ్ క్యారెక్టర్ గుర్తుండే ఉందిగా...అందులో జైలులో ఉన్న ఖైదీని తన మాస్టర్ ప్లాన్తో ఎలా హత్య చేస్తారో అదే స్టైల్లో నలుగురు ఖైదీలు కలిసి ఒక విచారణలో ఉన్న ఖైదీని హత్య చేశారు. ఈ సంఘటన తిహార్ జైలులోని అత్యంత కట్టుదిట్టమైన కట్టదిట్టమైన వార్డులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. డబ్బు విషయంలో ముదిరిన గొడవ కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
విచారణలో ఉన్న ఖైదీ దీపక్ను కిటికీ రాడ్డుతో అతనితో పాటు ఉంటున్న నలుగురు ఖైదీలు కొట్టి చంపారని జైలు అధికారు తెలిపారు. సప్తల్ బేడి, మన్ప్రీత్ సింగ్, రియాజ్, సూరజ్లు కలిసి దీపక్ను డబ్బు విషయమై అతని పై దాడికి దిగారు. దాడిలో తీవ్రగాయాలైన దీపక్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే సమయంలోనే మరణించాడు. జైలు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు హరీనగర్ పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు.