నాగార్జున, సానియాకు అనీల్ అంబానీ ఆహ్వానం | Anil ambani joins swachh bharat campaign, invites Nagarjuna, sania mirza | Sakshi
Sakshi News home page

నాగార్జున, సానియాకు అనీల్ అంబానీ ఆహ్వానం

Published Wed, Oct 8 2014 12:26 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నాగార్జున, సానియాకు అనీల్ అంబానీ ఆహ్వానం - Sakshi

నాగార్జున, సానియాకు అనీల్ అంబానీ ఆహ్వానం

ముంబయి : రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనీల్ అంబానీ చీపురు పట్టారు. ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ పిలుపు మేరకు ఆయన బుధవారం ఉదయం ముంబాయిలోని చర్చ్ గేట్ స్టేషన్ బయట చీపురు పట్టి శుభ్రం చేశారు. అనంతరం అనీల్ అంబానీ  స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని పలువురు సెలెబ్రెటీలకు సవాల్ విసిరారు. మేరీ కోమ్, అమితాబ్ బచ్చన్, సానియా మీర్జా, శోభా డే, ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా, పాటల రచయిత ప్రషన్ జోషి, హృతిక్ రోషన్, టాలీవుడ్ హీరో నాగార్జునలతో పాటు రన్నర్స్ క్లబ్ ఆఫ్ ఇండియాను ఆయన ఆహ్వానించారు.

స్వచ్ఛ భారత్ పథకం విజయవంతమయ్యేందుకు అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా అనీల్ చెప్పారు. మరోవైపు అనీల్ అంబానీని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనటాన్ని మోడీ ప్రశంసించారు. అనీల్ అంబానీ, ఇతరులతో కలిసి చర్చ్గేట్ స్టేషన్ వద్ద పరిశుభ్రం చేయటం మంచి ప్రయత్నమని ఆయన ట్విట్ చేశారు. కాగా అక్టోబర్ 2వ తేదీన మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తొమ్మిదిమంది ప్రముఖలకు ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. ఆ తొమ్మిదిమంది ప్రముఖుల్లో అనీల్ అంబానీ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement