ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక సచివాలయంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలైంది. వెలగపూడిలో నిర్మాణాలకు ఇచ్చిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషిన్ వేశారు.
పర్యావరణ అనుతులు లోపభుయిష్టంగా ఇచ్చారని పిటిషనర్ శర్మ వాదించారు. ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పర్యావరణ మంత్రిత్వశాఖ, రాష్ట్ర పర్యావరణ అథారిటీకి నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. కాగా, తదుపరి విచారణ జులై 7కు వాయిదా పడింది.
ఏపీ తాత్కాలిక సచివాలయంపై విచారణ వాయిదా
Published Mon, May 9 2016 6:52 PM | Last Updated on Sun, Sep 3 2017 11:45 PM
Advertisement