న్యూఢిల్లీ: మీడియాలో వార్తలు, వ్యాఖ్యానాల మధ్య తేడా తగ్గుతూ ఉండటంతో వీక్షకులు, పాఠకులు వాస్తవాల కోసం వెదుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతోందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారమిక్కడ ‘ప్రెస్ ఇన్ ఇండియా 2014-15’ వార్షిక నివేదికను ఆవిష్కరించారు. విస్తృతంగా టీవీ చానళ్లు వస్తున్నప్పటికీ, వాటిలో అనేక చర్చలు జరుగుతున్నప్పటికీ వాస్తవాలను తెలుసుకోవాలనే వీక్షకుల తృష్ణను అవి తీర్చలేకపోతున్నాయని అన్నారు. సమాచారం అనేది పవిత్రమైందని.. దానిని యథాతథంగా పాఠకులకు అందించాలని అన్నారు.
పత్రికారంగంలో 5.8% వృద్ధి.. దేశంలో 2014-15లో ప్రింట్ మీడియా 5.8 శాతం వృద్ధిని నమోదుచేసింది. ఈ కాలంలో 5,817 కొత్త పత్రికలు రిజిష్టర్ అయ్యాయి. దీంతో పత్రికల సంఖ్య 1,05,443కు చేరింది. దేశం మొత్తమ్మీద అత్యధిక వార్తాపత్రికలు, పీరియాడికల్స్ హిందీ భాషలో 42,493గా ఉండగా, రెండోస్థానంలో 13,661తో ఇంగ్లిష్ పబ్లికేషన్స్ ఉన్నాయి. ఈమేరకు రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఇన్ ఇండియా(ఆర్‌ఎన్‌ఐ) రూపొందించిన ‘ప్రెస్ ఇన్ ఇండియా 2014-15’ నివేదికను జైట్లీ విడుదల చేశారు. 2014-15లో అన్ని పత్రికల సర్క్యులేషన్ రోజుకు 51,05,21,445 కాపీలు. హిందీ పత్రికలు 25,77,61,985 సర్క్యులేషన్‌తో మొదటిస్థానంలో కొనసాగుతుండగా, 6,26,62,670తో ఇంగ్లిష్ పత్రికలు రెండో స్థానంలో, 4,12,73,949 కాపీలతో ఉర్దూ పత్రికలు మూడో స్థానంలో ఉన్నాయి.
వార్త, వ్యాఖ్యానం మధ్య తేడా ఏదీ: జైట్లీ
Published Wed, Dec 30 2015 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM
Advertisement
Advertisement