
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రిగా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన పీయూష్ గోయల్ రైతులు, పేదల అనుకూల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రశంసలు గుప్పించారు. వైద్య చికిత్స కోసం జైట్లీ అమెరికా వెళ్లడంతో ఆయన స్ధానంలో తాత్కాలికంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన పీయూష్ గోయల్ పార్లమెంట్‌లో శుక్రవారం 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
బడ్జెట్‌ను వృద్ధికి ఊతమిచ్చేలా, ద్రవ్యపరంగా కచ్చితత్వంతో కూడుకుని పేదలు, రైతుల అనుకూలమైనదిగా మలచడంలో అద్భుతంగా కృషిచేశారని పీయూష్ గోయల్‌ను అరుణ్ జైట్లీ అభినందించారు. దేశంలోని మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు చర్యలు చేపట్టారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ధేశించిన లక్ష్యాలు నెరవేరుస్తూ ఆర్థిక వ్యవస్థ ముందున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా బడ్జెట్‌కు రూపకల్పన చేశారని జైట్లీ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment