కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీపై ఏమైనా ఆలోచించారా?: కేటీఆర్‌ ట్వీట్ | KTR Tweet To Central Minister Piyush Goyal | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు కేటీఆర్‌ ట్వీట్‌

Published Mon, Mar 22 2021 8:11 PM | Last Updated on Mon, Mar 22 2021 9:47 PM

KTR Tweet To Central Minister Piyush Goyal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు సోమవారం ఓ ట్వీట్‌ చేశారు. ఏపీ పునర్‌విభజన చట్టంలో ఇచ్చిన ఓ హామీని గుర్తు చేశారు. కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీపై ఏమైనా ఆలోచించారా? ఏదైనా సమాచారం ఉంటే చెప్పండంటూ ట్వీట్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 150 ఎకరాలు సేకరించి కేంద్రానికి ఇచ్చిందని పేర్కొన్నారు. 

కాగా, కొద్దిరోజుల క్రితం కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ రాజ్యసభలో మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్ర విభజన చట్టంలో  కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ అంశాన్ని చేర్చిన వారు క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించారా?. ఏ రకంగా ఈ అంశాన్ని చేర్చారనేది వారినే అడగాలి. ప్రస్తుతం భారతీయ రైల్వే వద్ద అన్ని సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎంతో కష్టపడి సంపాదించి పన్నుల రూపంలో కట్టిన డబ్బును అవసరమున్న చోట వెచ్చించాలే తప్ప అనవసరంగా వృథా చేయొద్దు. కోచ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఫ్యాక్టరీలు ఇప్పుడు దేశంలో పూర్తిస్థాయిలో ఉన్నాయ’’ని తెలిపారు.  

చదవండి : ‘పిల్లగాడు గెలుస్తడా అన్నరు. కానీ గెలిపించిండ్రు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement